TTD : దళారులకు చెక్ పెట్టేందుకు మరో కొత్త టెక్నాలజీ..

భక్తులను నిలువు దోపిఢీ చేస్తున్నారు...

TTD : తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. ఆపద మొక్కుల స్వామి. అందుకే క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలు అన్నది భక్తుల ఆశ. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలు లెక్క చేయక శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు. అయితే భక్తుల అవసరం తిరుమల కొండలో కొందరు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోతుంది. భక్తులను దర్శనం వసతి కల్పిస్తామంటూ బురిడీ కొట్టించే కొందరు దళారీలు తిరుమల(Tirumala) కొండపై దండా కొనసాగిస్తున్నారు. భక్తులను నిలువు దోపిఢీ చేస్తున్నారు.

TTD Introduces New Technology…

భక్తులను వరుసగా మోసగిస్తున్న దళారీల భరతం పడుతున్న విజిలెన్స్ వింగ్ కొరడా జులిపిస్తోంది. ఇందులో భాగంగానే మూడ్రోజుల క్రితం ఇంటి దొంగల చేతివాటాన్ని గుర్తించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులకు స్వామి వారి దర్శనం చేయించిన దళారీలను పట్టుకుంది. అనుమానంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను విచారించిన విజిలెన్స్ వింగ్ ముఠా గుట్టురట్టు చేసింది. అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లను తయారు చేస్తున్న వైనం బయట పెట్టింది.

హైదరాబాద్,పొద్దుటూరు, బెంగళూర్ భక్తులు సుమారు 11 మంది నుంచి రూ 19 వేలు వసూలు చేసిన ఇంటి దొంగలను పట్టుకుంది విజిలెన్స్ విభాగం. తిరుపతికి చెందిన టాక్సీ డ్రైవర్లు శశి, చెన్నై జగదీష్, అగ్నిమాపక శాఖలో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ మణికంఠ, కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి, మరో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ భాను ప్రకాష్‌ లను విచారించిన విజిలెన్స్ వింగ్, తిరుమల 1 టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా రెండ్రోజుల క్రితం తిరుమలలో మరో దళారీ దందా ను విజిలెన్స్ వింగ్ బయట పెట్టింది.

దర్శనం,వసతి పేరుతో బెంగుళూరుకు చెందిన భక్తుల నుంచి రూ 1.31 లక్షలు వసూలు చేసిన వేణుగోపాల్ అనే దళారీ బాగోతాన్ని బయట పెట్టింది. భక్తుల నుంచి డబ్బులు కాజేసిన వేణుగోపాల్ పోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి దర్శనం కోసం 16న బెంగళూరు భక్తులను తిరుమలకు‌ రమ్మని చెప్పిన దళారీ వేణుగోపాల్ అసలు రంగు వాళ్ళకు కొండకు చేరాక బయట పడింది. మొసపోయినట్లు గుర్తించిన బెంగుళూరు చెందిన 7 మంది భక్తులు టీటీడీ(TTD) ఉద్యోగి ‌నంటూ పరిచయం చేసుకున్న వేణుగోపాల్ మోసగించినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో టీటీడీ(TTD) విజిలెన్స్ సిబ్బంది వద్ద మొరపెట్టుకున్నారు.

ఈ మేరకు భక్తుల ఫిర్యాదుతో వెలుగులోకి వేణుగోపాల్ ఘరానా మోసం బయటపడగా ఈ మేరకు విజిలెన్స్ అదికారులు విచారణ చేపట్టారు. గతంలోనూ వేణుగోపాల్ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు తిరుమల -1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. ఇలా తిరుమలలో భక్తులను మోసగిస్తున్న దళారీల దందాకు చెక్ పెడుతున్న విజిలెన్స్ వింగ్ టెక్నాలజీని వినియోగించి భక్తులను మోసగిస్తున్న దొంగల ముఠాల భరతం పడుతోంది.

Also Read : CM Siddaramaiah-Muda : సీఎం సిద్దరామయ్య కు ఈడి షాక్..300 కోట్ల విలువైన ఆస్తులు సీజ్

Leave A Reply

Your Email Id will not be published!