Minister S Jaishankar : పాక్ పోషిస్తున్న ఉగ్రవాదం పై భగ్గుమన్న భారత విదేశాంగ మంత్రి
పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదం ఇప్పుడు వారి పాలిట శాపమైంది...
S Jaishankar : పొరుగు దేశమైన పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(S Jaishankar) మరోసారి నిప్పులు చెరిగారు. ఉగ్రవాదం అనేది ఒక క్యాన్సర్ వంటిందని, పాక్ పెంచి పోషించిన ఉగ్రవాదం ఇప్పుడు సొంత ప్రజలపైనే ప్రభావం చూపిస్తోందని అన్నారు. శనివారంనాడిక్కడ జరిగిన 19వ నాని ఎ పాల్కీవాలా స్మారకోపన్యాసంలో ఆయన గత దశాబ్ద కాలంలో భారత్ అనుసరిస్తున్న దౌత్య విధానాలపై మాట్లాడారు.
Minister S Jaishankar Slams…
”సీమాంతరఉగ్రవాదం విషయంలో పొరుగున ఉన్న పాకిస్థాన్ మాత్రమే మినహాయింపుగా ఉంది. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదం ఇప్పుడు వారి పాలిట శాపమైంది. క్రమంగా అది ఆ దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తోంది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ సహా పలు దేశాలు కోరుతున్నాయి” అని జైశంకర్ చెప్పారు.భారత్‌ను ‘విశ్వబంధు’గా ఆయన అభివర్ణించారు. ప్రపంచ దేశాలతో స్నేహాన్ని పెంచుకుంటూ సమస్యలను తగ్గించుకుంటూ విశ్వవేదికపై నమ్మకమైన భాగస్వామిగా భారత్ వ్యవహరిస్తోందని, ప్రపంచ వేదికపై భారత్‌కు దక్కిన గుర్తింపే ఇందుకు నిదర్శనమని అన్నారు. భారత దౌత్య విధానం ప్రధానంగా మూడు అంశాలను అనుసరిస్తోందని, పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సుహృద్భావ సంబంధాలనేవి ఆ మూడు అంశాలని చెప్పారు.దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దౌత్య విధానాలను సాగిస్తున్నామన్నారు.
ఇటీవల చరిత్రలో చోటుచేసుకున్న కొన్ని ఉదాహరణలను జైశంకర్() ప్రస్తావిస్తూ.. ”సంక్షోభ సమయంలో ముఖ్యంగా మహమ్మారులు వచ్చినప్పుడు, ఆర్థికమాంద్యం దశలో పొరుగున ఉన్న చిన్న దేశాలకు భారత్ భరోసా కల్పించింది. 2023లో శ్రీలంక సంక్షోభంలో పడినప్పుడు 4 బిలియన్ డాలర్ల ప్యాకేజీ అందజేశాం. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు తలెత్తిన క్లిష్ట పరిస్థితులను చూస్తున్నాం. సన్నిహత సంబంధాలు, సహకారం అనేది ఏదో ఒకరోజు సమస్యల పరిష్కారానికి మార్గమవుతుంది. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సహకారం అనేది ఉండాలి” అని జైశంకర్ అన్నారు. పొరుగున ఉన్న మయన్మార్, ఆప్ఘనిస్థాన్‌తోనూ భారత్‌కు చిరకాల సత్సబంధాలు ఉన్నాయని చెప్పారు.
Also Read : Amit Shah Meet : ఏపీ బీజేపీ నేతలతో కీలక భేటీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి షా