MLA Somireddy : డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ అర్హుడు – ఎమ్మెల్యే సోమిరెడ్డి
MLA Somireddy : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, మంత్రి లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను తాను సమర్దిస్తున్నానని తెలిపారు. ఆ పదవికి నారా లోకేష్ వందశాతం అర్హులని అన్నారు. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారని కొనియాడారు.
MLA Somireddy Chandra Mohan Reddy Tweet
లోకేష్ పోరాటపటిమను చూసి టీడీపీ కేడర్‌తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టిందన్నారు. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాలా అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నట్టు ట్వీట్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : Delhi Elections 2025-Kejriwal : పారిశుధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ మోదీకి లేఖ