Trump-PM Modi : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు
నాప్రియ మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు...
PM Modi : డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించారు. కాసేపటి క్రితం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణం చేశారు. ఈ నేపధ్యంలో తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక ట్వీట్ చేశారు.
PM Modi Congratulates to..
‘నాప్రియ మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. యూనైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా మీ చారిత్రాత్మక ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా! మన రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రపంచానికి మంచి భవిష్యత్తును రూపొందించడానికి నేను మరోసారి మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను. అధ్యక్షుడిగా పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలి’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు!
కాగా,డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రపంచ దేశాధినేతలు, వ్యాపార దిగ్గజాలు, సెలబ్రిటీలు, ట్రంప్ అనుచరులు హాజరయ్యారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. తొలి వంద రోజుల్లో పలు నిర్ణయాలు తీసుకుంటానని చెబుతున్నారాయన. అక్రమ వలసదారులకు పంపించేస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. అమెరికా ఫస్ట్ అనేది రొటీన్ మాటే అయినా, ఇక బ్రాండ్ న్యూ డే మొదలవుతుందని ఆయన విక్టరీ ర్యాలీలో చెప్పారు. తద్వారా తన పాలనలో సంచలన నిర్ణయాలు, ధమాకా ప్రకటనలు ఉంటాయని ట్రంప్ చాటిచెప్పారు.
Also Read : Bengal CM-RG Kar Case : ఆర్జికర్ కేసుపై స్పందించిన బెంగాల్ సీఎం మమతా బనర్జీ