IT Raids : ప్రముఖ నిర్మాతల ఇళ్లల్లో ఐటీ శాఖ సోదాలు
తెలుగు చలనచిత్ర నిర్మాతల నివాసాలపై ఐటి శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు...
IT Raids : నగరంలో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాదులో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
IT Raids in Telangana
తెలుగు చలనచిత్ర నిర్మాతల నివాసాలపై ఐటి శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై ఐటి సోదాలు జరుగుతున్నాయి. కాగా సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో గేమ్ చెంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసిన విషయం తెలిసిందే. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read : TG Governor : ప్రతిభా పురస్కారాలు 2024 అవార్డులను ప్రకటించిన రాజభవన్