CM Revanth Reddy : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నోటీసులపై స్పందించిన సీఎం
కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు సీఎం రేవంత్...
CM Revanth Reddy : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అవడం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ కార్యదర్శి. ఫిరాయింపు మీద లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదంపై స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ప్రొసీజర్‌లో భాగంగానే ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు.
CM Revanth Reddy Comment
సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా క్యాబినేట్ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ నిర్ణయంతో ప్రధాని మీద ఒత్తిడి పెరుగుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలనే డిమాండ్ రానుందన్నారు రేవంత్. భవిషత్తులో ఈ రోజు తాము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలన్నారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ తామే చేశామన్నారు. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలన్నారు సీఎం.రాజకీయ ప్రయోజనాల కోసం కులగణన చేయడం లేదన్నారు రేవంత్. కులగణన వల్ల 76 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు.
కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు సీఎం రేవంత్. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదని సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్‌ను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా అని ప్రశ్నించారు రేవంత్. బీసీ రిజర్వేషన్ల మీదా ఆయన రియాక్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాలతో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ వేశామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ డెసిషన్ తీసుకుంటుందని పేర్కొన్నారు సీఎం.
Also Read : DY Speaker RRR : అసెంబ్లీకి సభ్యులు గైర్హాజరు అయినచో సభ్యత్వం రద్దు