TN Minister Regupathy : రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ కట్టుబడి పనిచేయాలి
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..
Regupathy : రాష్ట్రప్రభుత్వానికి గవర్నర్ కట్టుబడి వుండాల్సిందేనని రాష్ట్ర న్యాయశాఖామంత్రి రఘుపతి వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ ధర్మాన్ని గౌరవించేలా ఆయా రాష్ట్రప్రభుత్వాలకు కట్టుబడి పని చేయాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తన ఎక్స్పేజీలో పోస్టు చేశారు. దానిపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఎలాంటి సమాధానం చెప్తారని మంత్రి రఘుపతి ప్రశ్నించారు.
TN Minister Regupathy Comments
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఆహ్వానించారని, అయితే గవర్నర్ సభా హక్కులను ఉల్లంఘించి, ప్రసంగించకుండానే అసెంబ్లీ నుండి వెళ్లిపోయారని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వాలకు గవర్నర్లు కట్టుబడి పనిచేయాల్సిందేనన్న న్యాయపరమైన వాస్తవాన్ని ప్రధాని నరేంద్రమోదీ అంగీకరించారని, ఇందుకు గవర్నర్ ఏమి బదులిస్తారని మంత్రి ప్రశ్నించారు.
Also Read : Mallikarjun Kharge : మాజీ ప్రధాని కుమారుడి పై నోరు జారిన ఖర్గే