Sourav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్ ‘సౌరవ్ గంగూలీ’ కి బెంగాల్ లో రోడ్డు ప్రమాదం
ఓ పది నిమిషాల పాటు ఆయన హైవే పైనే ఉండాల్సి వచ్చింది...
Sourav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లోని ఓ యూనివర్సిటీకి ఓ కార్యక్రమంలోనే పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రమాదంలో గంగూలీ(Sourav Ganguly)కి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. అసలింతకీ ఏం జరిగిదంటే.. బుర్ద్వాన్‌లో యూనివర్సిటీకి ఓ ఈవెంట్‌కు గంగూలీ తన రేంజ్ రోవర్ కారులో బయలుదేరారు. ఆయనతో పాటు మరో రెండు కార్లు కూడా కాన్వాయ్‌లా వస్తున్నాయి. దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ వేపై ఉన్న కమ్రంలో ఆయన కాన్వాయ్‌లోకి సడెన్‌గా ఓ లారీ దూసుకొచ్చింది. దాంతో కాన్వాయ్‌లోని కార్లు అదుపుతప్పాయి. అయితే గంగూలీ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ అప్లై చేయడంతో ఆయన కారు వెనుక వస్తున్న మరో కారు రేంజ్ రోవర్‌ను ఢీ కొట్టింది.
Sourav Ganguly Met with an Accident
అయితే ఆయ సమయంలో కాన్వాయ్ సాధారణ వేగంతోనే ఉండటంతో ఎవరీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. వెంటనే కారు దిగిన గంగూలీ తన వెనుక కాన్వాయ్‌లో వస్తున్న వారిని పరామర్శించారు. ఓ పది నిమిషాల పాటు ఆయన హైవే పైనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత అంతా క్లియర్ చేసి.. గంగూలీ యూనివర్సిటీ వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఘటన గురించి తెలిసి క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇండియన్ క్రికెట్‌లో గంగూలీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన కెప్టెన్‌గా ఆయనను కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. కెప్టెన్సీతో పాటు గొప్ప బ్యాటర్‌గా సచిన్‌కు పోటీ ఇచ్చిన గంగూలీని అంతా ముద్దుగా దాదా అని పిలుస్తుంటారు. అలాగే బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా గంగూలీ సేవలు అందించారు.
Also Read : AP News : ఏపీ ఆరోగ్య శాఖలో డ్యూటీ కి డుమ్మా కొట్టిన 55 మందికి షాక్