GV Reddy Resign : రాజీనామా చేసిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ‘జీవీ రెడ్డి’
ఈవివాదం నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది...
GV Reddy : ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈవివాదం నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
AP Fiber Chairman GV Reddy Resigned
ఫైబర్ నెట్ లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై మూడు రోజుల క్రితం అధికారులపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీకి సానుభూతిపరులు అయిన ఉద్యోగులను జీవీ రెడ్డి తొలగించినప్పటికీ ఫైబర్ నెట్ ఎండీ ఆమోదం తెలపలేదని జీవీ రెడ్డి చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు. అధికారులతో కలిసి పని చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోపణలు చేసిన అధికారులతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతోనే రాజీనామా చేశానని జీవీ రెడ్డి తెలిపారు.
Also Read : MLC Kavitha Slams : రుణమాఫీ పేరిట రైతులను సర్కార్ మోసం చేయడం సరికాదు