Russia President Vladimir Putin: ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్

ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్

Vladimir Putin : పహాల్గాం ఉగ్రదాడి ఘటన తరువాత భారత్‌-పాక్‌ ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి… రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Vladimir Putin) ఫోన్ చేసారు. సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్‌ చేసిన పుతిన్‌… ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్‌ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇరుదేశాల మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ, పుతిన్ పునరుద్ఘాటించారు. మే 9న రష్యా విక్టరీ డేను నిర్వహించుకోనుంది. దీనిపై అధ్యక్షుడికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ ఏడాది రెండుదేశాల మధ్య వార్షిక సదస్సు భారత్‌ లో నిర్వహించనున్నారు. అందుకోసం మన ప్రధాని ఆహ్వానం పలకగా… పుతిన్(Vladimir Putin) అంగీకరించారు. ఈ విషయాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

Vladimir Putin Call to Modi

పహల్గాంలోని(Pahalgam) బైసరన్‌ లోయలో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తాము బాధ్యులమని పాక్‌ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’’ బాధ్యత ప్రకటించుకుంది. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇక ఈ ఘటన తర్వాత పాక్‌ నడ్డివిరిచేలా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల వేళ… ఐరాస భద్రతామండలిలో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే పుతిన్‌ ఫోన్ చేశారు. ఇంతకుముందు పహల్గాం ఘటన తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీకి పుతిన్ లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి క్రూరమైన నేరానికి ఎలాంటి సమర్థన లేదని పేర్కొన్నారు.

ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్… ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌ లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్‌ చానెళ్ల నిలిపివేత, భారత్‌ జలాల్లోకి పాక్‌ ఓడలు రాకుండా నిషేధం, పాక్‌ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Also Read : Ministry of Home Affairs: సివిల్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహణకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Leave A Reply

Your Email Id will not be published!