Deputy CM Pawan Kalyan : అంతర్గత భద్రతపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలి!

తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని పవన్ కల్యాణ్ చెప్పారు...

Pawan Kalyan : రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వారు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొంతమంది పాత్ర ఉందని చెప్పారు. సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత కంటే మిన్నగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యాల్లో ఉన్నాయని అన్నారు. ఇవాళ(మంగళవారం) గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడారు. తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని పవన్ కల్యాణ్ చెప్పారు.

Deputy CM Pawan Kalyan Shocking Comments

కుంకీ ఏనుగుల ద్వారా మదపుటేనుగుల గుంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమని సూచించారు. ఈ విషయంపైనే ఏపీ పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాశానని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందని చెప్పారు. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులను తలచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని అన్నారు. సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో, రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్‌గా దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Also Read : Jyoti Malhotra Youtuber : పాక్ స్పై యూట్యూబర్ ‘జ్యోతి మల్హోత్రా’ కేసులో సంచలన రహస్యాలు

Leave A Reply

Your Email Id will not be published!