వైసీపీ ఎంపీలు అవినాష్, మిధున్ రెడ్డి దాడులు స‌హించం

క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎస్. స‌విత‌

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ‘రప్పా…రప్పా నరకడంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది వారేన‌ని , ఆపైతమ పార్టీ వారితో నామినేషన్లు వేయనివ్వడం లేదు అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయ‌డం దారుణం అన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు జ‌గ‌న్ రెడ్డి వ్యవహరిస్తున్నార‌ని , ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, కొంచెం త‌గ్గితే మంచిద‌ని హిత‌వు ప‌లికారు మంత్రి. స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచి గొడ్డలి పార్టీ నాయకులు అరాచకాలకు, దాడులకు దిగారన్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం, పోలీసులు తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా పులివెందుల, కడపలో అత్యధిక మంది నామినేషన్లు వేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేకపోవడంతో, ప్రజలకు ముఖం చూపే ధైర్యం గొడ్డలి పార్టీ నాయకులు చేయలేక పోతున్నారన్నారు. స్థానిక సంస్థల్లో ఘోర ఓటమి ఖాయమని తెలిసి అరాచకాలకు తెరతీశారన్నారు.

నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచి వైసీపీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిధున్ రెడ్డి నేతృత్వంలో పుంగనూరు, పులివెందుల, తిరుపతి, రాయచోటి వంటి ప్రాంతాల్లో దౌర్జన్యాలకు పాల్పడ్డారన్నార‌ని వీరి అరాచ‌కాల‌ను స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని అన్నారు. ఇంకోసారి ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డితే చూస్తూ ఊరుకునేది లేద‌ని స్ట్రాంగ్్ వార్నింగ్ ఇచ్చారు ఎస్. స‌విత‌. గొడ్డలి పార్టీ నాయకుడు జగన్ సొంత నియోజక వర్గమైన పులివెందులలో టీడీపీ సహా పలు పార్టీ నాయకులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారని మంత్రి తెలిపారు. కడపలోనూ ఇదే తరహాలో భారీ ఎత్తున నామినేషన్లు అందజేశారన్నారు. గతంలో ఎన్నడూ పులవెందుల, కడపలో ఇలా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన చరిత్ర లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు, ప్రజాస్వామ్యం పరిరక్షణ వల్లే నామినేషన్లు దాఖలయ్యాయన్నారు ఎస్. స‌విత‌. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ఆరాచకాలకు పాల్పడిందో ప్రజలందరికీ గుర్తుందన్నారు. వారిలాగా నామినేషన్లు చింపడం, వేయకుండా అడ్డుకోవడం వంటి అరాచకాలకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్పడలేదని మంత్రి సవిత స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!