ముంబై : దేశ వ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన నటిగా గుర్తింపు పొందారు అందాల ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ సతీమణి రష్మిక మందన్నా. ఈ ఇద్దరూ చాలా కాలం తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన పీరియాడిక్ నేపథ్యంలో కలిగిన రణబాలిలో నటించారు. ఇది మిశ్రమ స్పందనతో ముందుకు సాగుతోంది. అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండలు సంచలనంగా మారారు. దీనికి ప్రధాన కారణం ఈ ఇద్దరూ కలిసి ప్రముఖ షో కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్నారు. దీనిని బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత, నటుడు , హోస్ట్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఆదరణ ఉంది. ఈ సందర్బంగా తమ మనసులోని మాటలను పంచుకున్నారు ఈ కొత్త సినీ జంట.
ష్మిక మందన్న చేసిన వ్యక్తిగత వెల్లడి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘కాఫీ విత్ కరణ్’ షో మళ్లీ చర్చనీయాంశమైంది. ఇందులో రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ పాల్గొన్న ఎపిసోడ్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తోంది. సల్మాన్ ఖాన్ ఎపిసోడ్‌తో ప్రారంభమైన ఈ సీజన్‌లో తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ జంట కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రోమో సరదాగా ఉండటమే కాకుండా, రష్మిక చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. విజయ్‌ను పెళ్లి చేసుకోమని తాను దాదాపు ఏడాది పాటు వెంట పడ్డానని రష్మిక వెల్లడించింది. విజయే ముందుగా రష్మికకు ప్రపోజ్ చేసి ఉంటాడని భావించిన అభిమానులకు, ఆమె చేసిన ఈ ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి రష్మిక ఎందుకు విజయ్‌ను పదేపదే పెళ్లి కోసం అడిగింది? విజయ్ సమాధానం చెప్పడానికి అంత సమయం ఎందుకు తీసుకున్నాడు? ఈ ప్రశ్నలు అభిమానుల్లో కుతూహలాన్ని పెంచాయి.
