చెన్నై : భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడు రాష్ట్రంలో. ఈ సందర్బంగా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. భారీ వర్సాల నేపథ్యంలో ఇవాళ ఆయన సమీక్ష చేపట్టారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా మోటార్ పంపులను ఉపయోగించి నగరంలోని 35 ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించినట్లు తెలిపింది. ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో చెన్నైలో తీసుకున్న సన్నద్ధత చర్యలను ముఖ్యమంత్రి ఆరా తీశారు. చెన్నైలో రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల 35 ప్రాంతాలు నీట మునిగాయి. రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జోసెఫ్ విజయ్ ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా, మోటార్ పంపులను ఉపయోగించి నీరు నిలిచిన 35 ప్రాంతాల నుండి నీటిని తొలగించినట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పేర్కొంది.
అలాగే 22 చోట్ల పడిపోయిన చెట్లను తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. రిప్పన్ బిల్డింగ్స్‌లోని జీసీసీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు సీఎం. ర్షపాత వివరాలను, సబ్‌వేలు, కాలువలు , నదీ ముఖద్వారాల వద్ద పర్యవేక్షణను, అలాగే ప్రజల ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించిన ఆయన రాత్రి కురిసిన భారీ వర్షాల సమయంలో సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. నగరంలోని 22 సబ్‌వేల నుండి వర్షపు నీటిని పంపుల ద్వారా తొలగించి, ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నట్లు కార్పొరేషన్ తెలిపింది. నీట మునిగిన ప్రాంతాల్లోని 13,500 మందికి ఆహారాన్ని పంపిణీ చేసినట్లు పేర్కొంది.
లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం 227 తాత్కాలిక సహాయ కేంద్రాలను, అలాగే ఆహారాన్ని సిద్ధం చేసి పంపిణీ చేయడానికి అవసరమైన సదుపాయాలతో కూడిన 112 కేంద్రీకృత వంటశాలలను జీసీసీ సిద్ధంగా ఉంచింది. సహాయక చర్యల కోసం 1,189 వాహనాలు , యంత్రాలను అందుబాటులో ఉంచారు. ఈ కార్పొరేషన్ వద్ద 676 అధిక సామర్థ్యం గల మోటార్ పంపులు, 100 హెచ్‌పి (HP) సామర్థ్యం కలిగిన 134 అద్దె పంపులు, ట్రాక్టర్లకు అమర్చిన 648 పంపులు , నీటిని సేకరించే 109 ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అలాగే, లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను తరలించేందుకు కార్పొరేషన్ 36 పడవలను, మత్స్యశాఖ 97 పడవలను సిద్ధంగా ఉంచాయి. కూలిపోయిన చెట్లను తొలగించేందుకు 15 శక్తిమాన్ చైన్‌సాలు, 231 పవర్ సా-లు, 52 టెలిస్కోపిక్ సా-లు , ఐదు వాహనాలకు అమర్చిన చెట్లను కత్తిరించే పరికరాలను సిద్ధం చేశారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో, అన్ని శాఖలు తమ సన్నద్ధతను పెంచుకోవాలని , సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
