అబుదాబి : ఇఫా 2027 వేడుకలు అబుదాబిలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు నటి జాన్వీ కపూర్. ఈ సందర్బంగా తన తల్లి, ప్రముఖ నటి, దివంగత శ్రీదేవి కపూర్ కు ఈ వేదిక ద్వారా నివాళులు అర్పించనున్నారు జాన్వీ కపూర్. ఈ విషయాన్ని ఆమేమ స్వయంగా పంచుకున్నారు. ఇఫా వేడుకల్లో జాన్వీ కపూర్ తన ప్రదర్శన ద్వారా తన తల్లిని స్మరించు కోనున్నారు. ఇదిలా ఉండగా ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ వంటి బాలీవుడ్ తారలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో ఉన్న ఎతిహాద్ ఎరీనాలో జనవరి 22, 23 తేదీల్లో 27వ ఇఫా అవార్డుల వేడుక జరగనుంది. ఈ సందర్భంగా కో ఫౌండర్ ఆండ్రీ టిమ్మిన్స్ మాట్లాడుతూ జాన్వీ తన తల్లి శ్రీదేవికి నివాళి అర్పించబోతోందని పేర్కొన్నారు. శ్రీదేవి ఈ ప్రపంచం చూసిన అద్భుతమైన కళాకారిణి.
ఈ ప్రదర్శన పట్ల జాన్వీ ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పారు. ఆమె కంటే ఎక్కువగా ఆమె తండ్రి బోనీ కపూర్ దీని కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇది ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది అని పేర్కొన్నారు. ఇక ఈసారి ఇఫా వేడుకల్లో కొన్ని కొత్త ఆకర్షణలు కూడా ఉన్నాయి. వరుణ్ ధావన్ మొదటిసారిగా అనన్య పాండేతో కలిసి ఈ అవార్డు వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు కరణ్ జోహార్, మనీష్ పాల్ కూడా పాల్గొంటారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా ఒక కొత్త వ్యవస్థను రూపొందించే క్రమంలో, వరుణ్ ధావన్ మొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరించడం ఒక ప్రత్యేక అంశం. ఆయనతో పాటు అనన్య, కరణ్, మనీష్ కూడా ఉంటారు. వరుణ్ ఈ బాధ్యతలో ముందుండి నడిపిస్తున్నారు, ఈ వేడుకను ఎలా నిర్వహించాలో ఆయన దగ్గర కొన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి అని ఆండ్రీ తెలిపారు.