ప్రపంచాన్నిఆక్టోపస్ లా కరోనా మహమ్మారి అల్లుకు పోయింది. చిన్నా పెద్దా పేద ధనిక ఎవ్వరినీ వదలడం లేదు. గత ఏడాది ఈ వ్యాధి బారిన పడి వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి దాకా ఈ డిసీజ్ నుండి బయట పడే మార్గం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. వందలాది మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు స్టార్ట్ చేశారు. కొన్ని ఫైనల్ దశకు వచ్చాయి. మరో వైపు ఇండియాలో కరోనా నివారణకు వ్యాక్సిన్ లు పంపిణీ చేయడం కేంద్ర సర్కార్ ప్రారంభించింది. ప్రపంచాన్నితన గాత్ర మాధుర్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తెలుగు వారి ఆరాధ్య దైవంగా భావించే శ్రీ పండితారాద్యుల బాలసుబ్రమణ్యం కరోనా దెబ్బకు ఈ లోకాన్ని వీడారు.
తమిళనాట మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరొందిన దళపతిగా పిలుచుకునే రజనీకాంత్ కూడా కరోనా బారిన పడి బయట పడ్డారు. సౌత్ ఇండియాలో టాప్ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి కూడా కొంత ఇబ్బంది పడ్డారు. తాజాగా ఆయన కుమారుడు ప్రముఖ నటుడు రామ్ చరణ్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తాను క్వారెంటైన్ లోకి వెళుతున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే కోవిడ్ టెస్టులు చేయించు కోవాలని కోరారు.
తాజాగా ప్రముఖ దర్శకుడిగా వెలుగొందుతున్న జాగర్లమూడి క్రిష్ కు కూడా పాజిటివ్ వచ్చిందని నిర్ధారణ అయింది. దీంతో ఈ డైరెక్టర్ కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హోం క్వారంటైన్ లోకి వెళ్లి పోయాడు. ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్లు తెరుచుకుంటున్న సమయంలో ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు, ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు జడుసుకునే ప్రమాదం ఉంది. ఇక క్రిష్ విషయానికి వస్తే తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్నాడు. షూటింగ్ కూడా స్టార్ట్ కావాల్సి ఉంది. ఇదే సమయంలో కరోనా అని తేలడంతో ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. పవన్ నటిస్తున్న సమయంలోనే 40 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాడు క్రిష్. ఈ వార్త కొంచెం ఆయన అభిమానులకు ఇబ్బంది కలిగించింది.
Breaking
- NTPC: ఎన్టీపీసీ ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం ! రూ.400 కోట్లు ఆస్తి నష్టం !
- Ex DGP Om Prakash: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు
- JD Vance: భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై మోదీ, వాన్స్ భేటీ
- Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్ సిద్దిఖీకి ‘డి’ కంపెనీ బెదిరింపులు
- Raj Kasireddy: మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
- AB Venkateswara Rao: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు మళ్లీ విచారణ చేపట్టాలి – ఏబీ వెంకటేశ్వరరావు
- 10th Class Results: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్
- Rahul Gandhi: సీఎం రేవంత్ కు రాహుల్ గాంధీ లేఖ ! ఎందుకంటే ?
- KTR: మేడిగడ్డ బ్యారేజీ డ్రోన్ కేసులో కేటీఆర్కు బిగ్ రిలీఫ్
- Wife: భర్తను కరెంట్ షాక్ తో చంపి పూడ్చిపెట్టిన భార్య

No comment allowed please