#TrumpStatement : ఏమిటో మాయదారి ట్రంప్ తో..ముందుకెళితే ముప్పు..వెనక్కొస్తే తప్పు

కమలా హ్యారిస్.. ‘మాటల పోగు’, దేవుడి ఆశీర్వాదంతోనే కరోనా వచ్చింది : ట్రంప్

నేను ‘వర్చువల్ డిబేట్’ లో.. జో బైడెన్ తో పాల్గొనను అని ట్రంప్ తేల్చి చెప్పడం..ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇలా మొండిఘటంలా ప్రవర్తించడం, ఆ తరహా డైలాగులు కొట్టడం,  బిగుసుకు పోవడం ఈ టైమ్ లో తగదని అమెరికా పెద్దలు ట్రంప్ కు  హితవు చెబుతున్నారు.

ట్రంప్ కి కరోనా రావడంతో ఈ డిబేట్ ఎదురెదురుగా కాకుండా.. ఇప్పుడు స్కూల్, కాలేజీ పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నట్టుగానే వారిద్దరి మధ్య వర్చువల్ డిబేట్ ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు చెబితే దానికి ట్రంప్ నో, నెవ్వర్ అంటున్నారు. నాకు కరోనా వస్తే నేనే భయపడటం లేదు..మీకెందుకు భయం..అనే రీతిలో ఆయన ప్రవర్తన ఉందని కొందరు విమర్శిస్తున్నారు..నేను డైరెక్టుగానే  ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను.. ఇన్ డైరెక్టుగా  మాట్లాడాల్సిన ఖర్మ నాకేం లేదు అన్నట్టు మాట్లాడటం.. ఈ టైమ్ లో కరెక్టు కాదని  అధ్యక్షునికి సర్ది చెప్పడానికి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు 15న డిబేట్ జరుగుతుందా? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

అయితే ఈ ఎపిసోడ్ తర్వాత ఇంకా వెరైటీగా మాట్లాడారు. ఈ కరోనా నాకు దేవుడి ఆశీర్వాదం వల్లనే వచ్చిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అవును..ఎందరో కరోనా బారిన పడి మరణించారు..వైద్యం తీసుకుంటున్నారు. అక్కడ ఆసుపత్రిలో సేవలు, మందులు ఎలా ఉన్నాయో..నన్ను తెలుసుకొమ్మని, చూసి రమ్మనమని  చెప్పినందువల్లే నాకు కరోనా వచ్చింది. అని చెప్పారు. నిజానికి ఆసుపత్రిలో వైద్యసేవలన్నీ చాలా బాగున్నాయి..మందులు బాగా పనిచేస్తున్నాయి. ఇంక ప్రజలకు నేను చెప్పే గొప్ప విషయం ఏముంటుంది..ఇది మా రిపబ్లికన్ పార్టీ ఘనత అని చెప్పుకొచ్చారు. ‘మాయదారోడితో ముందుకెళితే ముప్పు, వెనక్కొస్తే తప్పు’ అన్నట్టు ఉందని.. ట్రంప్ మాటలు విన్నవాళ్లు అనుకుంటున్నారు.

 

Leave A Reply

Your Email Id will not be published!