AtalBihari Vajpayee : భారత దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన ఒకే ఒక్కడు. చిరస్మరణీయుడు..అజాత శత్రువుగా పేరొందిన అరుదైన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి.
ఆయన ఈ దేశానికి 11వ ప్రధాన మంత్రిగా పని చేశారు. భావుడుకు, కవి, రచయిత, వక్త,, విలువలు కలిగిన రాజకీయ వేత్త.
25 డిసెంబర్ 1924లో యూపీలోని ఆగ్రాలో పుట్టారు. 2018 ఆగస్టు 16న ఇక సెలవంటూ వెళ్లి పోయారు.
ఆయన గురించి చెప్పడం ఒక ఒక జీవితం సరిపోదు. అంతలా ఆయన భారత రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు.
ప్రతి ఒక్కరు ఆయనను ప్రేమించిన వారే. వాజ్ పేయి కి అందరూ ఆప్తులే.
వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలకు నెలవైన భారత రాజకీయాలలో ఆయన వెరీ వెరీ స్పెషల్.
వాజ్ పేయి (AtalBihari Vajpayee )చివరి దాకా బ్రహ్మచారిగా ఉన్నారు. రెండో లోక్ సభకు ఎన్నికయ్యారు.
3వ, 9వ లోక్ సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసేంత దాకా పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు.
రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1968 నుంచి 1973 దాకా జన్ సంఘ్ పార్టీకి చీఫ్ గా ఉన్నారు.
1996లో తొలిసారి పీఎంగా పదవి దక్కినా కేవలం 13 రోజుల పాటే ఉన్నారు. 1998లో పీఎంగా 13 నెలల పాటు పాలించారు.
1999లో 13వ లోక్ సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానిగా 2004 దాకా పదవిలో ఉన్నారు.
1994లో వాజ్ పేయి కి ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం లభించింది. మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు.
ఆయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం 2015లో భారత రత్న ప్రకటించింది.
1947లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నారు. రాష్ట్ర ధర్మ, పాంచజన్య , స్వదేశ్ , వీర్ అర్జున్ పత్రికల్లో పని చేశాడు.
1942లో 23 రోజుల పాటు అరెస్ట్ అయ్యాడు. ముఖర్జీ వెంట ఉన్నాడు. మంచి వక్తగా పేరొందారు.
కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ కాలంలో వాజ్ పేయి (AtalBihari Vajpayee )జైలుకు వెళ్లాడు. జన్ సంఘ్ ను జనతా పార్టీని విలీనం చేశాడు.
ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి రాజకీయ నాయకుడు ఆయనే. 1980లో బీజేపీని ఏర్పాటు చేశాడు.
ఇందిరా గాంధీ హత్యను చేయడాన్ని ఖండించాడు. 1998లో వాజ్ పేయి హయాంలో అణు పరీక్షలను చేపట్టింది.
1999లో లాహూర్ కు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. కార్గిల్ వార్ కూడా అప్పుడే చోటు చేసుకుంది.
1999లో భారత విమానం హైజాక్ కు లోనైంది. దేశ ఆర్థిక, మౌలిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు వాజ్ పేయి.
రహదారుల అభివృద్ధికి కృషి చేశారు. 22 ఏళ్ల తర్వాత అమెరికా చీఫ్ బిల్ క్లింటన్ పర్యటించారు. రష్యా చీఫ్ పుతిన్ తో భేటీ అయ్యారు.
2001లో వాజ్ పేయి ప్రభుత్వం ప్రాథమిక, మాధ్యమిక విద్యాభివృద్ధి లక్ష్యంగా సర్వ శిక్షా అభియాన్ కార్యక్రమాన్ని తీసుకు వచ్చింది.
2005లో తాను క్రియాశీల రాజకీల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వాజ్ పేయిని రాజకీయ భీష్ముడిగా అభివర్ణించాడు.
ఆయనకు సంగీతం, నాట్యం, ప్రకృతి అంటే ఇష్టం. పుస్తక ప్రేమికుడు,
రచయిత. ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో పురస్కారాలు పొందారు. ఇలాంటి విలువలు కలిగిన నాయకుడు ఈ భూమి మీద తన ప్రయాణం సాగించినందుకు జాతి గర్వపడుతుంది.
ఇక వాజ్ పేయి తానే రాసుకున్నట్లు- నా కవిత్వం యుద్ధం యొక్క ప్రకటన, ఓటమికి గంభీరమైనది కాదు. ఇది ఓడిపోయిన సైనికుని నిరాశ యొక్క ఢంకా మోగించడం కాదు,
పోరాడే యోధుని గెలుపు సంకల్పం. ఇది నిస్పృహతో కూడిన నిస్పృహతో కూడిన స్వరం కాదు, విజయగర్వంతో కూడిన నినాదం.