AR Rahman : భారతీయ సంగీత ప్రస్థానంలో చెరపలేని అధ్యాయం అల్లా రఖా రెహమాన్. దేశానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చిన సంగీత స్వరకర్త. జగమంత తన సంగీత స్వర మాధుర్యాన్ని పంచుతూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు ఏ. ఆర్. రెహమాన్.
ఆయన అసలు పేరు ఏ. ఎస్. దిలీప్ కుమార్. వృత్తి రీత్యా కంపోజర్ , సంగీత దర్శకుడు, రికార్డ్ ప్రొడ్యూసర్ , గాయకుడు, వాయిద్య కారుడు, ప్రోగ్రామర్ కూడా.
1992లో తన కెరీర్ స్టార్ట్ చేశాడు. పుట్టుక రీత్యా ఏఆర్ రెహమాన్. తర్వాత ఇస్లాం మతం స్వీకరించాడు.
దీంతో దిలీప్ కుమార్ పేరును అల్లా రఖా రెహమాన్(AR Rahman) గా మార్చుకున్నాడు.
చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయాడు. కుటుండ పోషణ కోసం ఆయా సంగీత దర్శకుల వద్ద పని చేశాడు.
జింగిల్స్ కు మ్యూజిక్ చేశాడు. ఈ తరుణంలో అనుకోకుండా దిగ్గజ దర్శకుడు మణిరత్నం కంట పడ్డాడు.
ఇంకేం అతడి స్వర విన్యాసం రోజా మూవీతో ప్రారంభమైంది. ఆ సినిమా దేశాన్ని ఊపేసింది. ప్రపంచాన్ని కదిలించింది.
మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం అందుకున్నాడు ఏఆర్ రెహమాన్.
శాస్త్రీయ సంగీతానికి సూఫీలోని మాధుర్యాన్ని జోడించాడు. దీంతో పలు భారతీయ భాషలకు
తన సంగీతాన్ని విస్తరించాడు ఏ.ఆర్. రెహమాన్(AR Rahman). ప్రపంచ స్థాయిలో రెండు ఆస్కార్ అవార్డులు పొందాడు.
రెండు గ్రామీ పురస్కారాలు లభించాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు నాలుగు జాతీయ చలన చిత్ర పురస్కారాలు ,
15 ఫిలిం ఫేర్ అవార్డులు, 13 సౌత్ ఇండియా పురస్కారాలు అందుకున్నాడు ఏఆర్ రెహమాన్.
పేరెంట్స్ ఆర్.కె.శేఖర్, కస్తూరి. తండ్రి ఆలయాల్లో భజనలు పాడేవాడు.
నాలుగు సంవత్సరాల వయసులోనే పియానో నేర్చుకున్నాడు. కీబోర్డు ప్లేయర్ గా ఇళయరాజా, రమేష్ నాయుడు,
రాజ్ కోటి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద పని చేశాడు. తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఓ స్టూడియో స్టార్ట్ చేశాడు.
1989లో ఇస్లామ్ లోకి మారాడు.
ఓ జ్యోతిష్కుడి సలహాతో రెహమాన్ గా మార్చుకున్నాడు. దీంతో ప్రతి ఏటా కడప లోని పెద్ద దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను సందర్శిస్తారు.
సినిమాల్లోకి రాక ముందు బాపు సహకారంతో ఏపీ సర్కార్ చేపట్టిన అక్షరమాల ప్రాజెక్టుకు సంగీతం అందించాడు.
సంతోష్ శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయుడిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు రెహమాన్.
స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్ వరించింది.
తన గొంతుకు దక్కిన గౌరవం కాదని ఇది కోట్లాది భారతీయులకు లభించిన పురస్కారంగా పేర్కొన్నాడు రెహమాన్.
కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ సంప్రదాయాన్ని, రెగే, హిప్ హాప్ , ర్యాప్ , రాక్, పాప్ , జాజ్ , ఒపెరా, సూఫీ, ఆఫ్రికన్ , అరేబియన్ , పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మేలవించాడు.
ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ రెహమాన్ కు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది రెహమాన్ కు.
ఇక భార్య సైరా బాను గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిర పడింది. రెహమాన్ ఓ వ్యక్తి కాదు సంగీత శిఖరం.
Also Read : ‘దీదీ’ ఫైర్ బ్రాండ్ ట్రెండ్ సెట్టర్