Chateswar Pujara : ఆటలో పూర్తిగా రాహుల్ ద్రవిడ్ ను పోలి ఉండే భారత క్రికెట్ జట్టు ఓపెనర్ చతేశ్వర్ పుజారా (Chateswar Pujara)ఇటీవల పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ తరుణంలో జొహెన్నస్ బర్గ్ వేదికగా రెండో టెస్టులో రాణించాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అజింక్యా రహానేతో కలిసి 100 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక అవుటైన అనంతరం మీడియాతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి ఒక్క ప్లేయర్ కు అద్భతుంగా ఆడాలని ఉంటుందన్నాడు. అయితే పిచ్ పైకి వచ్చేసరికల్లా సీన్ మనం ఊహించినట్లు, మనం కోరుకుంటున్నట్లు ఉండదని స్పష్టం చేశాడు.
ప్రతి ఒక్కరికీ సెంచరీ సాధించాలని ఉంటుందని, కానీ కాలం ఎప్పుడూ ఒకేతీరున ఉండదన్నాడు చతేశ్వర్ పుజారా(Chateswar Pujara). ప్రతీసారి బాగా ఆడాలని ప్రయత్నం చేస్తామన్నాడు.
కానీ ఒక్కోసారి టైం బాగుండక వెంటనే మైదానాన్ని వీడాల్సి వస్తుందని పేర్కొన్నాడు పుజారా. అందుకే తాను ఆటపై మాత్రమే ఫోకస్ పెడతానని మిగతా ఆరోపణలు, విమర్శల గురించి అస్సలు పట్టించు కోనంటూ స్పష్టం చేశాడు.
దేశంలో ఆడటం ఒక ఎత్తైతే విదేశాలలో ఆడటం మరింత ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు. అలాంటి పిచ్ లపై హాఫ్ సెంచరీ సాధించడం మామూలు విషయం కాదన్నాడు చతేశ్వర్ పుజారా.
మైదానం వెలుపల ఉండి చూసే వాళ్లకు ఆట పరంగా ఎలాంటి వత్తిడి ఉంటుందనేది తెలియదన్నారు. టీమ్ మేనేజ్ మెంట్ తో పాటు జట్టు కెప్టెన్, హెడ్ కోచ్ , సిబ్బంది తనకు సపోర్ట్ గా ఉంటారని అన్నాడు. అందువల్ల ఇతర విషయాల గురించి అస్సలు పట్టించు కోనంటూ పేర్కొన్నాడు.
Also Read : శ్రీలంక క్రికెట్ జట్టుకు బిగ్ షాక్