KCR : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. అరెస్ట్ లు, కేసులు, ఆరోపణలు, జైళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే సీన్ మరింత రక్తి కడుతోంది.
ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ సైతం తాను కూడా ఉన్నానంటూ పోరాడుతోంది.
త్వరలో ఎన్నికలు రాబోతున్నాయంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎప్పటికైనా రెడీగా ఉండాలని హితబోధ చేశారు.
ఇక ఉద్యోగుల కోసం అంటూ ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష, అరె్స్ట్ కలకలం రేగింది. రావాల్సినంత ప్రచారం దక్కింది.
ఇంకో వైపు జేపీ నడ్డా సీరియస్ కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్ పై. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎంకు ఏటీఎం లాగా మారిందంటున్నారు.
అంతే కాదు మొత్తం కుటుంబ పాలనలో చిక్కుకుందని త్వరలోనే తమ రాజ్యం వస్తుందని భరోసా ఇస్తున్నారు.
మరో వైపు మంత్రి కేటాఆర్ సైతం తాను కూడా తక్కువ తినలేదంటూ జేపీ నడ్డాపై నిప్పులు చెరిగారు.
నడ్డా ఇది నీ అడ్డా కాదంటూ కామెంట్ చేశారు. ఆపై సీబీఐ, ఏసీబీ అన్ని కూడా ఎన్డీఏ సర్కార్ లో భాగం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదంతా బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో సమస్యలు కొకొల్లలు పేరుకు పోయాయి.
ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ ఏకంగా లక్షా 91 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ స్పష్టం చేసింది.
సర్కార్ మాత్రం ఓసారి 50 వేలు అంటోంది ఇంకోసారి 60 వేలు మాత్రమే అంటూ గందర గోళానికి దారి తీసేలా ప్రకటనలు చేస్తూ వచ్చింది.
ఓ వైపు అర్హులైన నిరుద్యోగులు 25 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నమోదు చేసుకున్నారు.
ఇది రాష్ట్రలో ఓ రికార్డ్. ఒకరు జాతీయ పార్టీకి చీఫ్ మరొకరు రేపు కాబోయే సీఎం((KCR). పవర్ వీరి చేతుల్లోనే ఉంది.
కానీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. చాలా మంది నిరుద్యోగులకు జాబ్స్ చేసేందుకు నిర్దేశించిన వయసు అర్హత కోల్పోతున్నారు. విద్యా వ్యవస్థలో మౌలిక వసతుల కల్పన లేకుండా పోయింది.
ప్రతిపక్ష పార్టీలు ఎంతగా గగ్గోలు పెట్టినా సర్కార్ పట్టించు కోవడం లేదు. ఇక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జైలుకు పంపిస్తామని చెబుతున్న బీజేపీ ఎందుకు ఆ పని చేయడం లేదన్నది జనం మాట.
ఇకనైనా ప్రజలు మేల్కోవాలి. లేక పోతే సమస్యలు అలాగే ఉంటాయి. మోదీ హామీలు కేసీఆర్(KCR ) మాటలు అన్నీ నీటి మూటలుగా మారాయంటున్నాయి విపక్షాలు.
Also Read : రాజకీయ రాద్ధాంతం ‘చన్నీ’ ఆగ్రహం