Bulli Bai App : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లి బాయి యాప్ (Bulli Bai App)కేసులో ఇప్పటి వరకు ముంబై, ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి దాకా దేశ వ్యాప్తంగా పలు చోట్ల నలుగురిని అరెస్ట్ చేశారు.
ఇందులో అరెస్ట్ అయిన వారంతా విద్యార్థులు ఉండడం విస్తు పోయేలా చేసింది.
బుల్లి బాయి యాప్ ద్వారా ముస్లిం మహిళలను టార్గెట్ చేస్తూ వారిని ఆన్ లైన్ లో వేలానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటి వరకు నీరాజ్ బిస్ణోయ్ , శ్వేతా సింగ్ , విశాల్ కుమార్ ఝా, మయాంక్ రావల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అస్సాం లోని జోర్హాట్ కు చెందిన రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిని అరెస్ట్ చేశారు.
ఇందులో వేలాది మంది ముస్లిం మహిళల వివరాలతో వేలానికి సిద్దం చేయడం విస్తు పోయేలా చేసింది.
ఈ అరెస్ట్ అయిన నలుగురు స్టూడెంట్స్ 20 ఏళ్లు దాటిన వారే ఉండడం గమనార్హం.
ఇవాళ బుల్లి బాయి యాప్ కు సంబంధించి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నీరజ్ బిష్ణోయ్ ఇవాళ అరెస్ట్ చేశారు.
భోపాల్ లో చదువుతున్న జోర్హాట్ వాసి ఈ బిస్ణోయ్ గిట్ హబ్ ప్లాట్ ఫారమ్ లో బుల్లీ బాయి యాప్ ను సృష్టించారు. ప్రధాన ట్విట్టర్ ఖాతాదారు కూడా.
వీఐటలో రెండో సంవత్సరం బీటెక్ స్టూడెంట్. ఉత్తరాఖండ్ కు చెందిన శ్వేతా సింగ్ కు 19 ఏళ్లు.
ఈమె కూడా ఇందులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు పోలీసులు. ఆమె ఇంటర్ పూర్తయింది.
ఇంజనీరింగ్ చదవాలని అనుకుంటోంది. ఇక బెంగళూరులో విశాల్ కుమార్ ఝా ఇంజనీరింగ్ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఇతడికి 21 ఏళ్లు. ఇదిలా ఉండగా పోలీసులు కావాలని ఇరికించారంటూ నిందితుడి తరపు న్యాయవాది ఆరోపించారు.
మరొకరు మయాంక్ రావల్. ఇతడిని ఉత్తరాఖండ్ లో అరెస్ట్ చేశారు. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్. దీని మూలాలు నేపాల్ లో ఉన్నట్లు గుర్తించారు. కానీ అదే పూర్తి కాదని పేర్కొన్నారు పోలీసులు.