Diljit Dosanjh : ఎవరీ దిల్జిత్ దోసాంజ్ అనుకుంటున్నారా. మోస్ట్ పాపులర్ సింగర్. నటుడు. రచయిత. వ్యాఖ్యాత. హిందీ, పంజాబీ సినిమాల్లో నటిస్తూ తనదైన స్టైల్ లో దుమ్ము రేపుతున్నాడు.
ఒక్కసారి స్టేజీ ఎక్కడాంటే జనం ఊగి పోవాల్సిందే. అంతటి జోష్ అతడు తెప్పిస్తాడు. 1984 జనవరి 6న పుట్టాడు ఈ అద్భుతమైన, ప్రతిభావంతమైన కళాకారుడు.
అంతే కాదు తాను కళాకారుడినే కాదని తనలో మానవత్వం ఇంకా బతికే ఉందంటూ చాటుకున్నాడు.
ఏకంగా అవార్డును కూడా కాదనుకున్నాడు. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించాడు దిల్జిత్ దోసాంజ్(Diljit Dosanjh).
అతడు గాయకుడే కాదు మంచి గేయ రచయిత కూడా. జాట్ అండ్ జూలియట్ , పంజాబ్ 1984, సర్దార్ జీ,
అంబర్సరియా , సర్దార్ జీ -2 , సూపర్ సింగ్ , సజ్జన్ సింగ్ రంగూట్ , షాదా , హెన్స్లా రఖ్ తదితర పంజాబీ మూవీస్ లో నటించాడు.
చాలా సినిమాలు బిగ్ సక్సెస్ అయ్యాయి. 2016లో క్రైమ్ థ్రిల్లర్ ఉడ్తా పంజాబ్ తో బాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు.
ఉత్తమ నటుడిగా అవార్డు పొందా. 2020 నాటికి అత్యుత్తమ నటుడిగా పలు అవార్డులు పొందాడు.
రైజింగ్ స్టార్ అనే రియాల్టీ షో కు న్యాయ నిర్ణేత గా ఉన్నాడు. 11వ ఆల్బమ్ దుమ్ము రేపింది. 12వ ఆల్బమ్ మూన్ చైల్డ్ ఎరా బిల్ బోర్డ్ కెనడియన్ టాప్ ఆల్బమ్ చార్ట్ లో చోటు దక్కించుకుంది.
దిల్జిత్ పంజాబ్ లోని జలంధర్ జిల్లా దోసంజ్ కలాన్ ఊరులో పుట్టాడు. తన మొదటి ఆల్బమ్ ఇష్క్ ద ఉడా అదాను విడుదల చేశాడు. 2004లో దిల్ రెండో ఆల్బమ్ విడుదలైంది. సుఖ్ పాల్ సుఖ్ నిర్మించిన మూడో ఆల్బమ్ స్మైల్ విడుదలైంది.
ఇది అ్యంత జనాదరణ పొందింది. ఐదో ఆల్బమ్ చాక్లెట్ పేరుతో వచ్చింది. భగత్ సింగ్ , నో టెన్షన్ , పవర్ ఆఫ్ డ్యూయెట్స్ , డ్యాన్స్ విత్ మీ మోస్ట్ పాపులర్ గా మార్చేశాయి దిల్జిత్ ను.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు, మరెన్నో సినిమాలు అంతకు మించి లెక్కలేనన్ని అవార్డులు అతడి స్వంతమయ్యాయి.
Also Read : రాజకీయ రాద్ధాంతం ‘చన్నీ’ ఆగ్రహం