David Warner : ప్రపంచ క్రికెట్ లో అత్యధిక జనాదరణ కలిగిన ఏకైక రిచ్ లీగ్ టోర్నీగా పేరొందిన ఇండియన ప్రిమీయర్ లీగ్ -2022 కు సంబంధించి వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లను కొన్ని జట్లు అట్టి పెట్టుకున్నాయి.
మరికొన్ని ఫ్రాంచైజీలు వదిలేసుకున్నాయి. దీంతో ఆటగాళ్లలో ఎవరు ఎటు వైపు ఉంటారనేది ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ ఇటీవల రెండు ఫ్రాంచైజీలకు పర్మిషన్ ఇచ్చింది.
ఈ రెండింటి ద్వారా భారీ ఎత్తున ప్రపంచ క్రీడా జగత్తులో ఎక్కడా ఏ టీంకు దక్కని ఆదాయం బీసీసీఐకి సమకూరింది. ఇది ఓ రికార్డ్ గా చెప్పవచ్చు. ఇప్పటికే బీసీసీఐ ఆదాయం వచ్చే రెండేళ్ల నాటికి దాదాపు రూ. 50 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
ఇది తాత్కాలికం మాత్రమే. ఇక ఒక్కో జట్టు ఫ్రాంచైజీ తమకు నచ్చిన క్రికెటర్లను ఎంచుకునే దిశగా ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇప్పటి దాకా కెప్టెన్ గా విశిష్ట సేవలు అందించిన భారత టెస్టు క్రికెట్ జట్టు స్కిప్పర్ విరాట్ కోహ్లీ తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
దీంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఇంకో సీనియర్ ఆటగాడి కోసం వెదుకుతోంది. ఇదే సమయంలో ఇప్పటికే రీటైన్ చేసుకునే లిస్టులను బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణ కమిటీకి అప్పగించింది.
ఇక సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్(David Warner ), రషీద్ ఖాన్ ను వదులుకుంది. కాగా కోహ్లీ తప్పుకున్నాక అతడి స్థానంలో ఇటవల ఫుల్ ఫామ్ లోకి వచ్చిన వార్నర్ ను తీసుకోవాలని అనుకుంటోందంటూ నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మరి మామకు చాన్స్ దక్కుతుందా లేదో వేచి చూడాలి.
Also Read : టీ20 కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్