Sachin Tendulkar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ఆల్ టైం టీమ్ ను ప్రకటించారు. ఆయన ప్రకటించిన తాజా జట్టులో విచిత్రంగా భారత క్రికెట్ కు ఎనలేని విజయాలు సాధించి పెట్టిన హైదరాబాద్ స్టార్ ప్లేయర్ , మాజీ ఆటగాడు మహమ్మద్ అజహరుద్దీన్ , ది వాల్ , ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు మహేంద్ర సింగ్ ధోనీకి కూడా చోటు కల్పించ లేదు.
అంతే కాకుండా ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి కూడా చాన్స్ ఇవ్వలేదు సచిన్. చాలా మందిని విస్మరించాడు. విచిత్రం ఏమిటంటే అజ్జూ సారథ్యంలోనే సచిన్ (Sachin Tendulkar)మెరిశాడు.
ఆ తర్వాత చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. తన రికార్డులు తప్ప భారత జట్టు విజయాల కోసం ఆడ లేదన్న అపప్రదను మూట గట్టుకున్నాడు. మరో వైపు అజహరుద్దీన్ సారథ్యంలోనే భారత జట్టుకు మెరికల్లాంటి ఆటగాళ్లు వచ్చారు.
ఆ తర్వాత గంగూలీ, ద్రవిడ్, ధోనీ సారథ్యాలలో టాప్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఇక జట్టు పరంగా చూస్తూ తన ఆల్ టైం టీమ్ లో సెహ్వాగ్ ఓపెనర్ గా , గవాస్కర్ లను ఎంచుకున్నాడు.
వన్ డౌన్ లో లారా, రెండో ప్లేస్ లో రిచర్డ్స్ , ఐదో స్థానంలో జాక్ కలిస్ , ఆరో ప్లేస్ లో గంగూలీని సూచించాడు. వికెట్ కీపర్ గా గిల్ క్రిస్ట్ , స్పిన్నర్లలో భజ్జీ, షేన్ వార్న్ , పేసర్లలో అక్రమ్ , మెక్ గ్రాత్ లను ఎంపిక చేశాడు.
Also Read : ఆటపై ఫోకస్ విమర్శలు డోంట్ కేర్