INDvsSA 2nd Test : రెండో టెస్టులో భార‌త్ ఓట‌మి

7 వికెట్ల తేడాతో స‌ఫారీ గెలుపు

IND vs SA 2nd Test : భార‌త జ‌ట్టుపై ప్ర‌తీకారం తీర్చుకుంది సౌతాఫ్రికా. స్వ‌దేశంలో జోహెన్నెస్ బ‌ర్గ్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో మూడు టెస్టు సీరీస్ లో భాగంగా భార‌త్, స‌ఫారీ జ‌ట్లు (IND vs SA 2nd Test)చెరో మ్యాచ్ గెలిచి స‌మంగా నిలిచాయి.

ఇక మూడో టెస్టు జ‌ర‌గాల్సి ఉంది. వ‌ర్షం అంత‌రాయం క‌లిగినా చివ‌ర‌కు సౌతాఫ్రికా జ‌ట్టు స్కిప్ప‌ర్ డీన్ ఎల్గ‌ర్ అద్భుతంగా ఆడాడు. త‌న జ‌ట్టుకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గెలుపును అందించాడు.

రెండో సెష‌న్ ఆగినా ఆ త‌ర్వాత వ‌ర్షం స‌ద్దు మ‌ణుగ‌డంతో మూడో సెష‌న్ ప్రార‌భ‌మైంది. ఇదే స‌మ‌యంలో 40 ప‌రుగుల‌తో ఆడుతున్న డెస్స‌న్ ను మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ పెవిలియ‌న్ పంపించాడు.

దీంతో భార‌త జ‌ట్టు శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. కానీ స‌ఫారీ స్కిప్ప‌ర్ డీన్ ఎల్గ‌ర్ అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. అడ్డు గోడ‌లా నిలిచాడు. భార‌త బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు.

ఏకంగా 96 ప‌రుగులు చేశాడు. మ‌రో ఆట‌గాడు బ‌వూమా తో క‌లిసి త‌న జ‌ట్టుకు స‌క్సెస్ అందంచాడు. ఇదిలా ఉండ‌గా బ‌వుమా 23 ప‌రుగులు చేసి సార‌థికి స‌హ‌కారం అందించాడు.

దీంతో ఈ టెస్టులో గెలిచి రికార్డు బ్రేక్ చేయాల‌ని అనుకున్న టీమిండియా జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు స‌ఫారీ కెప్టెన్. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 202, రెండో ఇన్నింగ్స్ లో 266 ప‌రుగులు చేసింది.

ఇక సౌతాఫ్రికా జ‌ట్టు 229 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 243 ప‌రుగులు చేసి గ్రాండ్ విక్ట‌రీ సాధించింది.

Also Read : విండీస్ చీఫ్ సెలెక్ట‌ర్ గా డెస్మండ్ హేన్స్

Leave A Reply

Your Email Id will not be published!