Desmond Haynes : విండీస్ చీఫ్ సెలెక్ట‌ర్ గా డెస్మండ్ హేన్స్

ప్ర‌క‌టించిన విండీస్ క్రికెట్ బోర్డు

Desmond Haynes : వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆ దేశానికి చెందిన మాజీ స్టార్ ప్లేయ‌ర్ , మాజీ ఓపెన‌ర్ డెస్మండ్ హేన్స్(Desmond Haynes) కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

ఈ మేర‌కు 65 ఏళ్ల హేన్స్ ను వెస్టిండీస్ చీఫ్ ( లీడ్ ) సెలెక్ట‌ర్ గా ఎంపిక చేసింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ఇవాళ ప్ర‌క‌టించింది విండీస్ బోర్డు.

బార్బాడియ‌న్ కు చెందిన డెస్మండ్ హేన్స్ 2024 జూన్ 30 వ‌ర‌కు జ‌ట్టు ఎంపిక‌కు సంబంధించిన ప్యాన‌ల్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని తెలిపింది.

ఈ క్ర‌మంలో వెస్టిండీస్ క్రికెట్ టీమ్ రెండు టీ20 ప్ర‌పంచ్ క‌ప్ లు, 2023 లో జ‌రిగే వ‌ర‌ల్డ్ క‌ప్, ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ జ‌ర‌గ‌నున్నాయి.

ఇదిలా ఉండ‌గా డెస్మండ్ హ‌స్త్రన్స్ 1978 నుంచి 1994 వ‌ర‌కు వెస్టిండీస్ జ‌ట్టు త‌ర‌పున 116 టెస్టులు ఆడాడు. ఇందులో భాగంగా 7 వేల 487 ప‌రుగులు చేశాడు.

అంతే కాకుండా హేన్స్ 238 వ‌న్డే ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ లు ఆడాడు. 1979లో గెలిచిన ప్ర‌పంచ క‌ప్ లో ఉన్నాడు. అంతే కాకుండా నాలుగు టెస్టుల‌కు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు.

ఈ సంద‌ర్భంగా కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశాడు డెస్మండ్ హేన్స్. త‌న‌ను చీఫ్ సెలెక్ట‌ర్ గా నియ‌మించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

అయితే సెలెక్ట‌ర్ గా ఉండ‌టం కృత‌జ్ఞ‌త లేని ప‌ని. కానీ క్రికెట్ వ్య‌వ‌స్థ‌లో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ద‌క్కినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు డెస్మండ్ హేన్స్.

మ‌రో వైపు ఒక‌ప్పుడు ప్ర‌పంచ క్రికెట్ ను శాసించిన విండీస్ ఆ త‌ర్వాత మెల మెల్లగా ప‌డుతూ లేస్తూ వ‌స్తోంది.

Also Read : టెండూల్క‌ర్ ఆల్ టైం టీమ్ ఇదే

Leave A Reply

Your Email Id will not be published!