WTC Test Rankings : జోహెన్నస్ బర్గ్ వేదికగా భారత్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో సౌతాఫ్రికా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ చివరి దాకా ఉండి తన జట్టుకు చిరస్మరణీయమైన గెలుపును అందించాడు.
దీంతో ప్రపంచ టెఎస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల (WTC Test Rankings)పట్టికలో ఈ ఒక్క సక్సెస్ తో దక్షిణాఫ్రికా మరింత ముందుకు దూసుకు వెళ్లింది. డీఎన్ ఎల్గర్ 96 పరుగులు చేసి నాటౌట్ గా నిలిస్తే కెప్టెన్ కు అండగా బవూమా 23 పరుగులు చేసి విజయ పథంలోకి తీసుకు వెళ్లారు.
భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఇక టీమిండియా సెంచూరియన్ వేదికగా ఫస్ట్ టెస్టు గెలుపొందితే సఫారీ టీం రెండో టెస్టులో జెండా ఎగుర వేసింది.
దీంతో భారత జట్టు 8వ స్థానానికి చేరుకుంది. 50 శాతం పాయింట్లతో ప్రోటీస్ టీమ్ 5వ స్థానానికి ఎగబాకింది. ఇక ఇప్పటి దాకా ఈ ఛాంపియన్ షిప్ లో రెండు జట్లూ అజేయంగా ఉన్నందున ఆసిస్, శ్రీలంక వరుసగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాయి.
పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసిస్ టీం యాషెస్ సీరీస్ చేజిక్కించుకుంది. ఇప్పటి కే మూడు మ్యాచ్ లు గెలుపొందింది. ఇదే క్రమంలో గత నవంబర్ , డిసెంబర్ లో స్వదేశంలో జరిగిన టెస్టు సీరీస్ లో శ్రీలంక 2-0తో వెస్టిండీస్ ను ఓడించింది.
ఇదిలా ఉండగా గాయం కారణంగా తప్పుకున్న విరాట్ కోహ్లీ మూడో టెస్టుకు సారథ్యం వహించనున్నాడు.
Also Read : త్వరలో దేశీవాలీ టోర్నీల నిర్వహణ