Rizwan Azam : పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ , ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ కు అరుదైన పురస్కారం దక్కింది. ప్రతి ఏటా వార్షిక అవార్డులను ప్రకటించడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేస్తూ వస్తోంది.
ఇదిలా ఉండగా గత ఏడాది 2021 కి గాను వివిధ విభాగాలకు సంబంధించి అవార్డులను ప్రకటించింది.
చిరకాల ప్రత్యర్థి, టీమిండియాను యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసింది పాకిస్తాన్ టీమ్.
దీంతో పాటు తమతో ఆడకుండా వెళ్లి పోయిన న్యూజిలాండ్ కు చుక్కలు చూపించింది.
విచిత్రం ఏమిటంటే టీమిండియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఏకంగా కోహ్లీ నేతృత్వంలోని మన జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించింది.
ఇదిలా ఉండగా ప్రపంచకప్ ఈవెంట్లలో భారత్ పై పాకిస్తాన్ విజయం ఇదే తొలిసారి.
కాగా టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక విజయాలు నమోదు చేసి చరిత్ర సృష్టించింది పాకిస్తాన్ క్రికెట్ టీమ్.
ఆ జట్టుకు స్కిప్పర్ గా ఉన్న బాబర్ ఆజమ్ , ఓపెనర్ రిజ్వాన్ (Rizwan Azam)లు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
అంతే కాకుండా హసన్ అలీ, షాహీన్ షా అఫ్రిదీ బౌలింగ్ అద్భుతంగా ఆడుతున్నారు.
ఇదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత ఏడాదికి గాను మహ్మద్ రిజ్వాన్(Rizwan Azam) ను అత్యంత విలువైన ఆటగాడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఈ సందర్భంగా అందుకున్నాడు.
టీ20 మ్యాచ్ ల్లో రిజ్వాన్ 1,326 పరుగులు సాధించాడు. హసన్ అలీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యాడు. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా సెలెక్ట్ చేసింది పీసీబీ బాబర్ ఆజమ్ ను. స్టార్ బౌలర్ వసీం జూనియర్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యాడు.
Also Read : విండీస్ చీఫ్ సెలెక్టర్ గా డెస్మండ్ హేన్స్