SP Charan : దివంగత గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం తనయుడు శ్రీపతి పండితారాధ్యుల చరణ్ పుట్టిన రోజు ఇవాళ. 1972 జనవరి 7న జన్మించారు. ఆయనకు ఇప్పుడు 49 ఏళ్లు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు.
తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. వట వృక్షమంత ఎదిగిన ఎస్పీ బాలు కు వారసుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. నటుడిగా, గాయకుడిగా, చిత్రనిర్మాతగా , యాంకర్ గా పేరొందారు ఎస్పీ చరణ్(SP Charan ).
ఏపీకి చెందిన ఎస్పీ చరణ్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖుడిగా వెలుగొందారు. ప్రముఖ భారతీయ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తమిళం, తెలుగు సినిమాలకు పాటలు పాడారు.
2000లో కన్నడ చిత్రం హుడిగిగాగిలో నటుడిగా మారారు. 2008లో వచ్చిన సరోజ చిత్రంలో నటించినందుకు గాను మంచి పేరు తెచ్చుకున్నారు. కాపిటల్ సినిమా వర్క్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.
2007లో కల్ట్ తో పాటు చెన్నై 600028 తో పాటు పలు చిత్రాలు నిర్మించారు. నాలో, న్యాబగంవరుతే, సరోజా, ద్రోహి, వనవరాయణ్ సినిమాలు పేరొందాయి.
ఆజా మేరీ సోనియే, అడిడా నయాండియా, అయ్యయో నెంజు, చిక్ చిక్ చిన్న, దీపంగల్ పెసుం, దేవలోగ రాణి , హ్యాపీ న్యూ ఇయర్ , హే వాడ భరణి, ఇనితు ఇనితు పాటలు పాడారు. జంబో, కదలోరం, కదల్ సాదగుడు, మజా మజా, మన్నిలే , నీనాన్ , ఓహ్ శాంతి, ఓరు నాన్బన్ , ప్లీజ్ సర్ , యారో యారుక్కుల్ , వెల్లై కోడి, మలై పోన్ మలై పాటలు హిట్ గా నిలిచాయి.
Also Read : ఓటీటీలో రానున్న పుష్ప మూవీ