AUS vs ENG 4th Test : కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఒక్కడే ఆదుకున్నాడు. అడ్డు గోడలా నిలబడ్డాడు ఆంగ్లేయ స్టార్ ప్లేయర్ బెయిర్ స్టో. ఇప్పటికే ఐదు టెస్టు సీరీస్ లో భాగంగా వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లలో దుమ్ము రేపింది ఆసిస్.
స్వదేశంలో జరుగుతున్న టెస్టు సీరీస్ లో 3-0 తో ఆధిక్యంలో కొనసాగుతోంది ఆస్ట్రేలియా టీమ్.
సిడ్నీ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టులో జానీ బెయిర్ స్టో సెంచరీతో చెలరేగాడు.
140 బంతులు ఎదుర్కొన్న ఈ స్టార్ ప్లేయర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓ వైపు వికెట్లు పడి పోతున్నా ఎలాంటి దయ లేకుండా ఆడాడు.
140 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో 8 ఫోర్లు 3 సిక్స్ లతో విరుచుకు పడ్డాడు.
ఏకంగా 103 పరుగులు చేసి మైదానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 13 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో స్టార్ట్ చేసిన ఇంగ్లండ్ (AUS vs ENG 4th Test)ఆదిలోనే ఇబ్బంది పడింది.
ఆసిస్ బౌలర్ల ప్రతాపానికి కేవలం 36 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ తరుణంలో మరో స్టార్ బ్యాటర్ స్టోక్స్ తో కలిసి జానీ స్టో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు ప్రాణం పోశారు.
మెల మెల్లగా ఆడుతూ ఆసిస్ బౌలర్లను ఎదుర్కొంటూ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు.
వీరిద్దరూ కలిసి 100 భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ టీమ్ 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది.
ప్రస్తుతం జానీ బెయిర్ స్టోతో పాటు లీచ్ నాలుగు పరుగులతో మైదానంలో ఉన్నారు.
ఇక ఆసిస్ బౌలర్ల పరంగా చూస్తే కెప్టెన్ పాట్ కమిన్స్ , బోలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్టార్క్ , గ్రీన్ , లియాన్ చెరో వికెట్ తీశారు.
Also Read : హనుమ విహారిపై గంభీర్ కామెంట్స్