Ramesh Babu Actor : సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణ పెద్ద కుమారుడు, ప్రిన్స్ మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు.
గత కొంత కాలంగా ఆయన కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఏఐజీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే కన్ను మూసినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే మహేష్ బాబుకు కరోనా సోకింది. ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక రమేష్ బాబు నటుడిగా(Ramesh Babu Actor ) సుపరిచితుడు. 1965 అక్టోబర్ 13న పుట్టారు.
ఆయనకు ప్రస్తుతం 56 ఏళ్లు. తన సినిమా కెరీర్ ను 1974 అల్లూరి సీతారామ రాజు చిత్రంలో బాల నటుడిగా ప్రారంభించారు. ఇందులో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు.
ఘట్టమనేని రమేష్ బాబు 15 సినిమాలలో నటించారు. బజార్ రౌడితో పేరు తెచ్చుకున్నారు. కలియుగ కృష్ణుడు, చిన్ని కృష్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణ గారి అబ్బాయి , తదితర సినిమాల్లో నటించారు.
1997లో తన తండ్రి కృష్ణ తో కలిసి ఎన్ కౌంటర్ సినిమాలో నటించారు. ఆనాటి నుంచి నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. 2004 నుంచి నిర్మాతగా ఉన్నారు.
కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సూర్యవంశం హిందీతో పాటు అర్జున్, అతిథి సినిమాలు నిర్మించారు. 2011లో వచ్చిన దూకుడుకు సమర్పకుడిగా ఉన్నారు రమేష్ బాబు.
రమేష్ బాబు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : బాలయ్య బాబు అరుదైన రికార్డు