Salman Bhatt : సఫారీ టూర్ లో భాగంగా భారత జట్టు ఇప్పుడు తీవ్ర విమర్శలు మూట గట్టుకుంటోంది. మూడు టెస్టుల్లో భాగంగా సెంచూరియన్ లో టీమిండియా మొదటిసారిగా సఫారీ జట్టుపై 113 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇక జొహెన్నస్ బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ప్రధానంగా విరాట్ కోహ్లీ వెన్నుముక కారణంగా తప్పు కోవడంతో కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ అప్పగించింది భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ.
ఇదిలా ఉండగా భారత మాజీ కెప్టెన్ సునీల్ మనోహర్ గవాస్కర్ సంచలన కామెంట్స్ చేశాడు. కేఎల్ రాహుల్ లోప భూయిష్టమైన నాయకత్వం కారణంగా భారత జట్టు ఓడి పోయిందని ఆరోపించారు.
అంతే కాదు పరమ చెత్త ఫీల్డింగ్ ఏర్పాటు చేయడం దారుణమన్నాడు. ప్రధానంగా భారత బ్యాటర్లు సరిగా ఆడక పోవడం వల్లనే ఇలా జరిగిందంటూ మాజీ ఆటగాళ్లు పేర్కొన్నారు.
చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఆడినా మిగతా ప్లేయర్లు వికెట్లను పారేసు కోవడం బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందన్నాడు. ఈ సమయంలో రిషబ్ పంత్ కంటే సాహా ను తీసుకోవాలని సూచించాడు మరో భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్.
ఈ సమయంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ (Salman Bhatt)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ చిన్న పిల్లాడేమీ కాదని ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్ చేసిన కామెంట్ సరైనదేనని పేర్కొన్నాడు.
ఏ ఫార్మాట్ లో ఎలా ఆడాలని అన్నది వారికే ఉటుందన్నాడు.
Also Read : స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత