OYO : కొత్త ఏడాదిలో పంట పండింది ఓయో కు. వారాంతంలో ఏకంగా 110 కోట్ల మొత్తం కస్టమర్ల బుకింగ్స్ జరిగాయి. 2017 డిసెంబర్ నుండి కొనసాగుతున్న ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూగా వస్తోంది.
ఈసారి 2022 నూతన ఏడాది వేడుకల సందర్భంగా 58 శాతం బుకింగ్ లు జరిగాయి. ఈ విషయాన్ని ఓయో హొటల్స్ చీఫ్ రితేశ్ అగర్వాల్ వెల్లడించారు. 10 లక్షల మందికి పైగా బుకింగ్ చేసుకున్నట్లు తెలిపారు.
ఈ బుకింగ్ లు ప్రపంచ వ్యాప్తంగా ఓయోకు చెందిన హోటళ్లలో చేసుకోవడం వల్ల పెద్ద ఎత్తున ఆదాయం సమకూరిందన్నారు. ఉద్వేగ భరితంగా ఉందని ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ వేదికలపై ప్రకటించారు రితేష్ అగర్వాల్(OYO).
ఈ న్యూ ఇయర్ లో మాతో అర మిలియన్ కంటే ఎక్కువ రాత్రులు బుక్ చేసుకున్న మిలియన్ మందికి ధన్యవాదాలు. ఓయోలో భాగస్వామ్యైన వారికి, తమ సపోర్ట్ అందించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 2020 నుంచి 90 మహమ్మారి వారాంతాల్లో 2021 బుకింగ్ అత్యధికంగా ఉందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కస్టమర్ బుకింగ్ ల విలువ వంద కోట్లకు పై మాటేనని పేర్కొన్నారు.
2016 నాటి లక్షా 2 వేలతో పోలిస్తే 2021లో డిసెంబర్ 30 నుంచి 31 మధ్యన వారాంతంలో బుక్ చేసిన గదులు 5 లక్షల 30 వేలకు పైగా ఉన్నాయని స్పష్టం చేశారు రితేష్ అగర్వాల్.
2020లో 61 శాతం, 2019లో 57 శాతం, 2018లో 63 శాతం, 2017లో 55 శాతం బుకింగ్ జరిగాయని పేర్కొన్నారు. ఒక రకంగా ఓయోకు కాసుల పంట పండినట్లే.
Also Read : కాఫీ వద్దే వద్దు చాయ్ ముద్దు