Anderson Broad : అండ‌ర్స‌న్ అదుర్స్ బ్రాడ్ సూప‌ర్

ఓడకుండా ప‌రువు నిల‌బెట్టారు

Anderson Broad  : సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టెస్టు అత్యంత నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ముగిసింది. ఊహించ‌ని రీతిలో గెలుపు అంచుల దాకా వ‌చ్చిన ఆసిస్ ను నిలువ‌రించింది ఇంగ్లండ్.

ఆసిస్ కెప్టెన్ క‌మిన్స్ తెలివైన నిర్ణ‌యం తీసుకున్నా ఎందుక‌నో విజ‌యం వ‌రించ లేక పోయింది. స‌రిగ్గా భార‌త్ తో ఆసిస్ ఆడిన మ్యాచ్ మ‌ళ్లీ గుర్తుకు వ‌చ్చేలా చేసింది.

గ‌త ఏడాది ఇదే వేదిక‌పై అశ్విన్, హ‌నుమ విహారి క‌లిసి ఆస్ట్రేలియాను అడ్డుకున్నారు. త‌మ స‌త్తా చాటారు. అలాంటి స‌న్నివేశం మ‌రోసారి పున‌రావృతం కావ‌డం విశేషం.

ఆతిథ్య జ‌ట్టుకు వైట్ వాష్ అయ్యే అవ‌కాశాల‌కు గండి కొట్టింది ఇంగ్లండ్. ప్ర‌పంచంలోనే అత్యంత అనుభ‌వం క‌లిగిన ప్లేయ‌ర్ గా పేరొందిన జేమ్స్ అండ‌ర్స‌న్ , త‌న బౌలింగ్ భాగ‌స్వామి అయిన మ‌రో స్టార్ బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ తో క‌లిసి మ్యాచ్ చేజార‌కుండా, ఆసిస్ చేతుల్లోకి వెళ్ల‌కుండా అడ్డుకున్నారు.

ఈ స‌మ‌యంలో తెలివిగా క‌మిన్స్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను రంగంలోకి దించాడు. పేస‌ర్లు వ‌ద్ద‌ని కేవ‌లం స్పిన్న‌ర్ల‌తో మాత్ర‌మే ఆడించాల‌ని అంపైర్లు సూచించారు.

దీంతో ఆసిస్ జ‌ట్టులో స్పిన్న‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ క‌మిన్స్ స్మిత్ కు బంతి ఇచ్చాడు. 100 వ ఓవ‌ర్ లో వికెట్ కూల్చినా విజ‌యం మాత్రం అంద‌కుండా పోయింది ఆసిస్ కు.

ఇదే విష‌యాన్ని మాజీ భార‌త జ‌ట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీ‌ధ‌ర్ గుర్తు చేశాడు. అండ‌ర్స‌న్(Anderson Broad ), బ్రాడ్ ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తాడు.

Also Read : ఆ ఇద్ద‌రి మీద క‌త్తి వేలాడుతోంది

Leave A Reply

Your Email Id will not be published!