Samantha : నటి సమంత అటు సినిమాల్లోనే కాదు ఇటు వెబ్ సీరీస్ ల్లో నటిస్తూ బిజీగా మారారు. తాను నాగ చైతన్యతో విడి పోయాక చాలా ఫ్రీగా మూవ్ అవుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తోంది.
అందరి కంటే సమంత ఎక్కువగా ఏ మాత్రం వీలు కుదిరినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అంతే కాకుండా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, తాను రోజూ వారీగా చేసే కార్యక్రమాలతో పాటు ఈ మధ్య ఫిట్ నెస్ విషయంలో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.
అంతే కాదు తాను ఇంట్లో జిమ్ చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ (Samantha)చేసింది. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దంటూ సూచించింది.
విలువైన కాలాన్ని గుర్తించి తోచినంత మేరకు ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తే ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవని అంటోంది. ప్రస్తుతం సమంత ఎక్కువగా స్ఫూర్తిని కలిగించే కొటేషన్స్ పోస్ట్ చేస్తూ వస్తోంది.
ఇవి మరింత ఉత్సాహాన్ని, లోన్లీ నెస్ ఫీల్ కాకుండా చేస్తాయని అంటోంది. తాను కూడా అందరి లాగే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాననంటూ తెలిపింది.
అందరినీ విస్తు పోయేలా చేసింది. ఇటీవల ఆమె రోష్నీ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
తాను ఇవాళ మీముందు ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నానంటే నా సన్నిహితులు, కుటుంబం, కౌన్సిలర్ల సాయమేనని కుండ బద్దలు కొట్టింది సామ్…
Also Read : ప్రకాశ్ రాజ్ పని రాక్షసుడు
No comment allowed please