Rakul Preet Singh : ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇవాళ ఆమె గురుద్వారాను సందర్శించారు. తన మొక్కులు తీర్చుకున్నారు. గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ముంబై లోని గురుద్వారాను సందర్శించారు.
అంతకు ముందు ఆమె ప్రార్థనలు చేశారు. ఆశీర్వాదం తీసుకున్నారు. బయటకు వచ్చిన అనంతరం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. గోవింద్ సింగ్ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా జనవరి 9న అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
గురుద్వారా కమిటీ నియమ నిబంధనల మేరకు తెల్లటి పైజామా, కుర్తా ధరించి వచ్చారు నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). ఇవాళ దేశ వ్యాప్తంగా పేదలకు ఆహారం, దుస్తులు పంపిణీ చేశారు భక్తులు. గోవింద్ రాయ్ గా జన్మించిన గురు గోవింద్ సింగ్ జీ పదవ సిక్కు గురువు.
ఆధ్యాత్మిక నాయకుడు, యోధుడు, కవి, తత్వవేత్త కూడా. ఆయనను సిక్కులే కాదు ఇతర మతస్తులు, కులాలకు చెందిన వారు కూడా ఆరాధిస్తారు. అంతా వాహె గురు అంటారు.
ఆయన బోధనలు శాశ్వత సందేశాలుగా నిలిచి పోయాయి. స్వార్థం అంతరంగం నుండి నిర్మూలించనప్పుడు గొప్ప సుఖాలు, శాశ్వాతమైన శాంతి లభిస్తాయి. లక్ష్యాన్ని కలిగి ఉండండి. విజయం కోసం పని చేయండి.
ఎలాంటి కష్టాలు , ప్రతికూలతలు మీ ఉద్దేశాన్ని ప్రభావితం చేయనీయవు. మీరంతా సంతోషకరమైన, ఆధ్యాత్మిక , సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా.
స్తుతి అనేది మీరు ప్రాపంచిక సాగరాన్ని దాటగలిగే తెప్ప లాంటిదని గోవింద్ జీ బోధించారు..
Also Read : రణవీర్ సింగ్ బిగ్ పిక్చర్ సూపర్