IPL 2022 : ఆ రెండు ఫ్రాంచైజీల‌కు డెడ్ లైన్

జ‌న‌వ‌రి 31 లోగా తేల్చుకోండి

IPL 2022 : భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఊహించ‌ని రీతిలో వేలం పాట‌లో రెండు జ‌ట్ల‌కు సంబంధించి భారీ ఎత్తున ఆదాయం కూడ‌గ‌ట్టిన బీసీసీఐ ఇప్పుడు ఆ జ‌ట్ల ఫ్రాంచైజీల‌కు డెడ్ లైన్ విధించింది.

మెగా ఐపీఎల్ వేలానికి సంబంధించి ఒక్కో ఫ్రాంచైజీ ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది డిసెంబ‌ర్ 25 వ‌ర‌కు డెడ్ లైన్ ప్ర‌క‌టించినా అహ్మ‌దాబాద్ ఫ్రాంచైజీని ద‌క్కించుకున్న సీవీసీ క్యాపిట‌ల్ పై బెట్టింగ్ ఆరోప‌ణ‌లు చోటు చేసుకున్నాయి.

దీంతో క్రికెట‌ర్ల ఎంపిక‌కు సంబంధించిన అంశం వాయిదా ప‌డింది. ఐపీఎల్ 2022(IPL 2022) కు డెడ్ లైన్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఈ త‌రుణంలో ఇంకా ఆయా జ‌ట్లు ఎవ‌రిని తీసుకుంటున్నాయి.

ఇంకెవ‌రిని వ‌దులుకుంటున్నాయో ఇప్ప‌టికే లిస్టులు ఐపీఎల్ నిర్వ‌హ‌ణ క‌మిటీకి అంద‌జేశాయి. ఇంకా ఖ‌రారు కావాల్సింది మాత్రం కొత్త ఫ్రాంచైజీలైన ల‌క్నో, అహ్మ‌దాబాద్ లే మిగిలి ఉన్నాయి.

దీంతో ఇక వాయిదా వేయ‌లేమ‌ని, డెడ్ లైన్ పొడిగించ లేమంటూ పేర్కొంది బీసీసీఐ. ఇప్ప‌టికే ప‌లుసార్లు చాన్స్ ఇచ్చామ‌ని ఇలాగైతే క‌ష్ట‌మంటూ తెగేసి చెప్పింది.

ఈ మేర‌కు ఈనెల 31 వ‌ర‌కు తుది గ‌డువు ఇస్తున్నామ‌ని ఇక మ‌రోసారి పొడిగించ బోయేది లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ రెండు ఎంపిక చేసుకోవ‌డం పూర్త‌యితేనే మిగ‌తా ఐపీఎల 2022కు సంబంధించి వేలం ప్ర‌క్రియ స్టార్ట్ అవుతుంది.

అహ్మ‌దాబాద్ కెప్టెన్ గా శ్రేయ‌స్ అయ్య‌ర్, కోచ్ గా నెహ్రా, మెంటార్ గా కిర్ స్టెన్ ను నియ‌మించుకుంది. ఇక ల‌క్నో హెడ్ కోచ్ గా ఆండీ ఫ్ల‌వ‌ర్ , మెంటార్ గా గంభీర్ ను నియ‌మించుకుంది.

Also Read : రిష‌బ్ పంత్ కంటే సాహా బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!