Michael Vaughan : ఇంగ్లండ్ జ‌ట్టుకు మైఖేల్ వాన్ కితాబు

అద్భుతంగా ఆడిందంటూ ప్ర‌శంస

Michael Vaughan  :యాషెస్ టెస్టు సీరీస్ లో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టెస్టులో అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించి ఓడి పోకుండా డ్రా చేసినందుకు ప్ర‌త్యేకంగా ఇంగ్లండ్ టీమ్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan ).

ఇప్ప‌టికే ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా మూడు టెస్టులు గెలిచి సీరీస్ చేజిక్కించుకుంది. అయితే వైట్ వాష్ చేయాల‌న్న ఆసిస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు జేమ్స్ అండ‌ర్స‌న్ , స్టువ‌ర్ట్ బ్రాడ్.

చివ‌రి దాకా వారు నిలిచి ఆట ఆసిస్ చేతుల్లోకి వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. దీంతో ఇదే సిడ్నీ మైదానంపై భార‌త్ సైతం ఆస్ట్రేలియాను చివ‌రి దాకా నిలిచి ఓడి పోకుండా కాపాడింది.

గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో టీమిండియా త‌ర‌పున అశ్విన్ , విహారిలు అడ్డు గోడ‌లా నిలిచారు. తాజాగ్ సేమ్ సీన్ రిపీట్ కావ‌డాన్ని మ‌రోసారి గుర్తు చేశాడు మైఖేల్ వాన్.

ప్ర‌పంచ స్థాయి బౌల‌ర్ గా ఇప్ప‌టికే పేరొందిన జేమ్స్ అండ‌ర్స‌న్ అత్యంత సంయ‌మ‌నంతో ఆడ‌డం గ్రేట్ అని కితాబు ఇచ్చాడు మైఖేల్ వాన్. ప‌నిలో ప‌నిగా స్టూవ‌ర్ట్ ను కూడా ఆకాశానికి ఎత్తేశాడు.

ఓ వైపు ఆసిస్ బౌల‌ర్లు ఎంత వ‌త్తిడి తెచ్చినా ఎలాంటి ఒడిదుడుకుల‌కు లోను కాకుండా చివ‌రి దాకా నిలిచి ఉన్నార‌ని, ఓడి పోకుండా ఇంగ్లండ్ ప‌రువు కాపాడార‌ని పేర్కొన్నాడు మైఖేల్ వాన్.

ఇలాంటి స‌మ‌యాల్లోనే అస‌లైన ఆట‌గాళ్లు ఎవ‌రు అనేది బ‌య‌ట ప‌డుతుంద‌న్నాడు.

Also Read : ఉత్కంఠ పోరులో నాలుగో టెస్ట్ డ్రా

Leave A Reply

Your Email Id will not be published!