Hardik Pandya : భారత క్రికెట్ జట్టు ఆటగాడిగా పేరొందిన హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya )బంపర్ చాన్స్ దక్కనుందా. అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇప్పటికే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2022 కు సంబందించి బీసీసీఐ నిర్వహించిన వేలం పాటలో రెండు కొత్త జట్లకు చాన్స్ దక్కింది.
అహ్మదాబాద్ , లక్నో ఫ్రాంచైజీలు భారీ ఎత్తున డబ్బులు వెచ్చించి వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ 2021 దాకా 8 జట్లు పాల్గొంటుండగా ఈ ఏడాది జరిగే ఐపీఎల్ -22 లో అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలతో కలిపి 10 జట్లు పాల్గొననున్నాయి.
ఇద్దరు స్వదేశీ ఆటగాళ్లతో పాటు ఓ విదేశీ ప్లేయర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. లక్నో కేఎల్ రాహుల్ వైపు స్కిప్పర్ గా చూస్తుండగా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ సారథిగా హార్దిక్ పాండ్యాను (Hardik Pandya )ఎంపిక చేయాలని అనుకుంటోందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే పలు జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను వదులుకున్నాయి. ఈ తరుణంలో ఎవరిని ఎంపిక చేసుకోవాలనే దానిపై కొత్త ఫ్రాంచైజీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
సీవీసీ యాజమాన్యంలోని అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో తన తొలి సీజన్ కు భారత సీనియర్ ఆల్ రౌండర్ పాండ్యాను స్కిప్పర్ గా దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ నుండి పూర్తి స్పష్టత ఇచ్చినట్లు టాక్. ప్రపంచంలోని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ లలో ఒకరైన అహ్మదాబాద్ ఐపీఎల్ జట్లను 5 వేల 625 కోట్లకు కొనుగోలు చేసింది.
అంతే కాకుండా రషీద్ ఖాన్ , ఇషాన్ కిషన్ లతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు సమాచారం. ప్రధాన కోచ్ గా ఆశిష్ నెహ్రా, డైరెక్టర్ గా విక్రమ్ సోలంకి , టీమ్ మెంటార్ గా కిర్ స్టెన్ ను నియమించింది.
Also Read : ఆ ఇద్దరి మీద కత్తి వేలాడుతోంది