Virat Kohli : విమ‌ర్శ‌లు డోంట్ కేర్ ఆట‌పై ఫోక‌స్

స్ప‌ష్టం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ

Virat Kohli  : ప్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట‌ర్ ల‌లో ఒక‌డిగా పేరొందిన విరాట్ కోహ్లీని విమ‌ర్శ‌లు వెంటాడుతున్నాయి. ఈ త‌రుణంలో ఇవాళ మీడియాతో మ‌న‌సు విప్పి మాట్లాడాడు.

త‌న ఫామ్ లేమిపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టాడు కోహ్లి(Virat Kohli ). తాను ఎవ‌రి గురించి ప‌ట్టించు కోన‌ని అన్నాడు. ఒక‌రి గురించి ఆలోచించే టైం త‌న‌కు లేద‌న్నాడు.

ఆట పైనే ఫోక‌స్ పెడ‌తాన‌ని రికార్డుల గురించి ప‌ట్టించు కోన‌ని స్ప‌ష్టం చేశాడు. అంతే కాకుండా సంచ‌ల‌న కామెంట్స్ కూడా చేశాడు. తాను దేశం కోసం ఆడ‌తాన‌ని, జ‌ట్టుకు ఎంత మేర‌కు స‌పోర్ట్ గా ఉన్నాన‌నే దానిపై మాత్ర‌మే ఆలోచిస్తాన‌ని చెప్పాడు.

ఒక‌రి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవ‌డం త‌న అభిమ‌తం కానే కాద‌న్నాడు. అంతే కాకుండా తాను రేపు కేప్ టౌన్ లో జ‌రిగే మూడో టెస్టు మ్యాచ్ కు రెడీగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇదిలా ఉండ‌గా టీ20, వ‌న్డే జ‌ట్టు సార‌థ్య బాధ్య‌తల నుంచి త‌ప్పించింది బీసీసీఐ. ఓన్లీ టెస్టు జ‌ట్టు కెప్టెన్ గా మాత్ర‌మే ఎంపిక చేసింది.

ఈ త‌రుణంలో సుదీర్ఘ కాలం త‌ర్వాత కోహ్లీ సార‌థ్యం లోని భార‌త జ‌ట్టు సెంచూరియ‌న్ వేదిక‌గా స‌ఫారీ జ‌ట్టుపై 113 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ఇదే స‌మ‌యంలో కోహ్లీకి వెన్ను నొప్పి తీవ్రం కావ‌డంతో రెండో టెస్టుకు దూర‌మ‌య్యాడు. దీంతో కోహ్లీ (Virat Kohli )స్థానంలో కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వం వ‌హించాడు.

అనూహ్యంగా 7 వికెట్లతో సౌతాఫ్రికా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ త‌రుణంలో భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. రాహుల్ నాయ‌క‌త్వ వైఫ‌ల్యం వ‌ల్ల‌నే టీమిండియా ఓడి పోయింద‌ని ఆరోపించాడు.

Also Read : అండ‌ర్స‌న్ అదుర్స్ బ్రాడ్ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!