Aijaz Patel : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ప‌టేల్

మ‌యాంక్ అగ‌ర్వాల్ కు బిగ్ షాక్

Aijaz Patel : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ ప్ర‌తి నెలా ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు ప్ర‌క‌టిస్తుంది. గ‌తంలో కంటే భిన్నంగా దీనిని ప్ర‌వేశ పెట్టింది. ఇలాంటి అవార్డుల వ‌ల్ల ఆట‌గాళ్ల‌లో మ‌రింత ఆడాల‌న్న క‌సి పెరుగుతుంద‌ని భావించి ఇస్తూ వ‌స్తోంది.

ఈసారి డిసెంబ‌ర్ నెల‌కు గాను ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ప‌లువురు ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధానంగా భార‌త క్రికెట్ జ‌ట్టు కు చెందిన ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ , న్యూజిలాండ్ స్పిన్న‌ర్ అజాజ్ ప‌టేల్ (Aijaz Patel)ల మ‌ధ్య పోటీ నెల‌కొంది.

చివ‌ర‌కు అగ‌ర్వాల్ కు షాక్ ఇస్తూ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ పుర‌స్కారాన్ని ప‌టేల్ కు అప్ప‌గించింది. ఈ మేర‌కు అధికారికంగా ఐసీసీ ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా మ‌యాంక్ అగ‌ర్వాల్ , అజాజ్ ప‌టేల్ తో ప‌టు ఆస్ట్రేలియా పేస‌ర్ మిచెల్ స్టార్క్ కూడా పోటీ ప‌డ్డాడు.

కానీ పాయింట్ల ప‌ట్టిక‌లో ప‌టేల్ ముందంజ‌లో నిలిచాడు. ప‌టేల్(Aijaz Patel) భార‌త్ లో ఇండియాతో జ‌రిగిన కీవీస్ టెస్టు మ్యాచ్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాడు. ముంబై వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా 10 వికెట్లు కూల్చాడు.

ఇప్ప‌టికే ఇదే రికార్డును న‌మోదు చేసిన జిమ్ లేక‌ర్, అనిల్ కుంబ్లే రికార్డును ఈక్వ‌ల్ చేశాడు. ఆ ఒక్క టెస్టులో మొత్తం 14 వికెట్లు ప‌డ‌గొట్టాడు. విచిత్రం ఏమిటంటే అజాజ్ ప‌టేల్ ది స్వ‌స్థ‌లం ముంబై కావ‌డం విశేషం.

త‌ల్లిదండ్రులు సౌతాఫ్రికాకు వ‌ల‌స పోయారు. ఆ జ‌ట్టులో చోటు సంపాదించుకుని త‌న స‌త్తా చాటాడు ప‌టేల్.

Also Read : కెప్టెన్ కానున్న హార్దిక్ పాండ్యా

Leave A Reply

Your Email Id will not be published!