Virat Kohli : భారత స్టార్ ప్లేయర్. ప్రపంచ దిగ్గజ క్రికెటర్ గా పేరొందిన టీమిండియా టెస్టు స్కిప్పర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పటికే టీ20, వన్డే జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ ఇటీవల తగ్గేదేలే అంటూ కుండ బద్దలు కొట్టాడు.
ఆయన ప్రధానంగా బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీని, సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మను టార్గెట్ చేశాడు. తనను తొలగించే సమయంలో సమాచారం ఇవ్వ లేదంటూ ఆరోపించాడు.
దీనిని పూర్తిగా ఖండించాడు చేతన్ శర్మ. గంటన్నర ముందు విరాట్ కోహ్లీకి సమాచారం ఇచ్చామని, కోహ్లీ చెప్పిందంతా అబద్దమని స్పష్టం చేశాడు. అటు వైపు గంగూలీ ఇటు వైపు చేతన్ శర్మల దాడితో కొంత మౌనం వహించాడు కోహ్లీ.
కానీ ఉన్నట్టుండి మూడో టెస్టు ప్రారంభం కంటే ముందు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నప్పుడు భారత జట్టు ర్యాంక్ 7వ స్థానంలో ఉండేదని కానీ తాను వచ్చాక టీమిండియాను అగ్ర స్థానంలో నిలబెట్టానని చెప్పాడు.
అందుకు సంబంధించి స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నానని బాంబు పేల్చాడు. కోహ్లీని నాయకుడిగా తప్పించడంపై తీవ్ర దుమారం రేగింది. తాజా, మాజీ ఆటగాళ్లు బీసీసీఐని తీవ్రంగా తప్పు పట్టారు.
దీనిపై బీసీసీఐ చీఫ్ దాదా క్లారిటీ ఇచ్చాడు. ప్రధానంగా టెస్టులో టీమిండియాను తలెత్తుకునేలా చేయాలని అనుకున్నానని ఆ దిశగా ప్రయత్నాలు చేశానని, అందులో సక్సెస్ అయ్యానని చెప్పాడు కోహ్లీ.
Also Read : కెప్టెన్ కానున్న హార్దిక్ పాండ్యా