Sukumar : సునామీ లాంటోడు సుకుమార్

సినీ జ‌గ‌త్తులో ఉత్తుంగ త‌రంగం

Sukumar : ఎవ‌రీ సుకుమార్. ఏమిటీ ఆయ‌న వెనుక ఉన్న క‌థ‌. సినీ ద‌ర్శ‌కుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటూ ఉండే ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎందుకంటే సుకుమార్ సుకుమార‌మే.

అంత‌కంటే ఎక్కువ‌గా క్రియేటివిటీ క‌లిగిన వ్య‌క్తి. అంత‌కు మించి ప‌ని రాక్ష‌సుడన్న పేరుంది.

మొన్న‌టి దాకా భార‌తీయ సినామాను బాలీవుడ్ ఏలింది. కానీ డిజిట‌ల్ టెక్నాల‌జీ యుగం వ‌చ్చాక తెలుగు సినిమా ఏలుతోంది. దుమ్ము రేపుతోంది.

ఆర్య‌తో మొద‌లైన ఆయ‌న ప్ర‌యాణం దేశాన్ని త‌న వైపు తిప్పుకునేలా చేసిన పుష్ప వ‌ర‌కు వెరీ వెరీ స్పెష‌ల్.

పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా మారి పోయాడు. ఇవాళ సుకుమార్ (Sukumar)పుట్టిన రోజు.

ఆయ‌న పూర్తి పేరు బండ్రెడ్డి సుకుమార్. ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా మ‌ట్ట‌పాడు ఆయ‌న స్వ‌స్థ‌లం.

1970 జ‌న‌వ‌రి 11న పుట్టిన ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి వ‌య‌స్సు ఇప్పుడు 52 ఏళ్లు. ఎక్క‌డా రాజీ ప‌డ‌ని మ‌న‌స్త‌త్వం ఆయ‌న స్వంతం.

ఆయ‌న ముద్దు పేరు సుక్కు కూడా. భార్య త‌బిత‌. ఆయ‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు.

వృత్తి రీత్యా మొద‌ట్లో గ‌ణితం బోధించే అధ్యాప‌కుడుగా ఉన్నారు. పేరెంట్స్ తిరుప‌తి రావు నాయుడు, వీర‌వేణి.

సుకుమార్ ద‌ర్శ‌కుడే కాదు క‌వి, ర‌చ‌యిత‌, ఆలోచ‌నాప‌రుడు, తాత్వికుడు.

సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన వ్య‌క్తి. పిల్ల‌ల‌కు పాఠాలు బోధించే ఈ లెక్చ‌ర‌ర్ ఉన్న‌ట్టుండి సినిమా రంగం వైపు మ‌ళ్లాడు.

2004లో మొట్ట మొద‌టి సారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య తీశాడు. సూప‌ర్ డూప‌ర్ హిట్ . సుకుమార్ తో పాటు బ‌న్నీని స్టార్ గా నిల‌బెట్టేలా చేసింది. రామ్ పోతినేనితో రెండో సినిమా జ‌గ‌డం తీశాడు.

సినిమా టేకింగ్ లో త‌న‌దైన ముద్ర‌తో ఆక‌ట్టుకున్నాడు. మూడో సినిమా ఆర్య‌కు సీక్వెల్ తీశాడు.

నాగ‌గ చైత‌న్యంతో 100% లవ్ మూవీ తీశాడు. అది యూత్ ను బాగా ఆక‌ట్టుకుంది.

అందులోని పాట‌ల‌న్నీ బాగా ఆక‌ట్టుకున్నాయి. 2014 ప్రిన్స్ మ‌హేష్ బాబుతో నేనొక్క‌డినే తీశాడు.

వ‌ర్క‌వుట్ కాలేదు. 2016లో జూనియ‌ర్ ఎన్టీఆర్ తో నాన్న‌కు ప్రేమ‌తో తీశాడు.

అది బిగ్ హిట్ గా నిలిచింది. 2018లో రాం చ‌ర‌ణ్ తో రంగ‌స్థ‌లం తీశాడు.

త‌న కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత 2021లో మ‌రోసారి ఐకాన్ స్టార్ తో పుష్ప మూవీ తెర‌కెక్కించాడు.

దేశాన్ని ఒక ఊపేసింది. సుకుమార్ కు పుస్త‌కాలంటే పిచ్చి. ఆయ‌న బుక్స్ ప్రేమికుడు. నిత్య పాఠ‌కుడు.

ఒక్కో సినిమా ఒక్కో వైవిధ్యంతో ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతూ వ‌చ్చారు. రాబోయే రోజుల్లో సుకుమార్ మ‌రిన్ని సినిమాలు తీయాల‌ని మ‌న‌ల్ని అల‌రించాల‌ని కోరుకుందాం.

Also Read : మామూలోడు కాదు ద‌మ్మున్నోడు

Leave A Reply

Your Email Id will not be published!