Rahul Dravid : ప్రపంచ క్రికెట్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కలిగిన ఒకే ఒక్కడు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid ). ఈ మాజీ క్రికెటర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తక్కువ మాట్లాడటం ఎక్కువ పని చేయడం ఆయనకు ఉన్న నైపుణ్యాలలో ఎన్నదగింది.
భారతదేశ క్రికెట్ చరిత్రలో ద్రవిడ్ చెరపలేని అధ్యాయం. క్రికెట్ లో లివింగ్ లెజెండ్ గా పేరొందారు. ది వాల్ అన్న పేరును సార్థకం చేసుకున్న అరుదైన క్రికెటర్.
అంతకు మించి గొప్ప మెంటార్. కోచ్. అంతకంటే ఎక్కువగా స్ఫూర్తి దాయకమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు.
ఇవాళ రాహుల్ ద్రవిడ్ పుట్టిన రోజు. కుడి చేతి బ్యాట్స్ మెన్. కొన్నేళ్ల పాటు టీమిండియాకు వికెట్ కీపర్ గా సేవలు అందించాడు. ఎన్నో సార్లు భారత్ ను తన అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ తో ఆదుకున్నాడు.
హైదరాబాద్ స్టార్ మహమ్మద్ అజహరుద్దీన్ సారథ్యంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో ద్రవిడ్(Rahul Dravid )ఒకడు. 136 టెస్టులు ఆడిన ద్రవిడ్ 11 వేల 182 పరుగులు చేశాడు.
339 వన్డేలు ఆడి 10 వేల 765 పరుగులు చేశాడు. టెస్టుల్లో 53. 50 సగటు రేటు ఉండగా వన్డేల్లో 39.43 శాతంగా ఉంది. టెస్టుల్లో 270 అత్యధిక రన్స్ చేస్తే 153 పరుగులు వన్డేలో భారీ స్కోర్.
ఇక రాహుల్ ద్రవిడ్ జనవరి 11న 1973లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పుట్టాడు. 1996 నుంచి భారత క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఐసీసీ డిక్లేర్ చేసిన ప్రపంచంలోని 10 మంది అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.
గవాస్కర్, టెండూల్కర్ తర్వాత భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ద్రవిడ్ ఒకడు. 2007 ఫిబ్రవరి 6న వన్డేల్లో 10 వేల పరుగులు చేశాడు.
2007 సెప్టెంబర్ 14న నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి ద్రవిడ్ కు.
ఇండియన్ క్రికెట్ అకాడమీకి ఎనలేని సేవలు అందించాడు. అంతే కాదు భారత క్రికెట్ జట్టుకు పదికాలాల పాటు అద్భుతమైన ఆటగాళ్లను రెడీగా ఉంచాడు. బీసీసీఐ ఏరికోరి రాహుల్ ద్రవిడ్ కు హెడ్ కోచ్ పదవిని కట్టబెట్టింది.
Also Read : సఫారీతో సమరం భారత్ సమాయత్తం