Lal Bahadur Shastri : విలువ‌ల శిఖ‌రం శిఖ‌ర స‌మున్న‌తం

భార‌త రాజ‌కీయాల‌లో చెర‌గ‌ని ముద్ర‌

Lal Bahadur Shastri  : సుదీర్ఘ భార‌త దేశ రాజ‌కీయాల‌లో చెర‌గ‌ని ముద్ర వేసిన నాయ‌కుడు. ధీరోదాత్తుడు లాల్ బ‌హదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri ). ఇవాళ ఆయ‌న వ‌ర్దంతి. స‌రిగ్గా ఇదే రోజు 1966లో ఇక సెల‌వంటూ వెళ్లి పోయారు.

ఈ దేశానికి రెండో ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 1961 నుంచి 1963 దాకా హోం శాఖ మంత్రిగా ప‌ని చేశారు.

1951 నుంచి 56 దాకా రైల్వే శాఖ మంత్రిగా ప‌ని చేశారు.

ఈ స‌మ‌యంలో రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌కు బాధ్య‌త వహిస్తూ రాజీనామా చేశారు. 1951 నుంచి 56 దాకా ప్ర‌ధానిగా ఉన్నారు.

1904 అక్టోబ‌ర్ 2న యూపీలోని ఆగ్రాలో పుట్టాడ‌రు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి(Lal Bahadur Shastri). తాష్కెంట్ లో అనుమాన‌స్ప‌ద స్థ‌తిలో మర‌ణించారు.

స్వాతంత్ర ఉద్య‌మంలో ప్ర‌ముఖ పాత్ర పోషించాడు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడు.

మ‌హాత్ముడికి, నెహ్రూకు న‌మ్మ‌క‌స్తుడు. 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్దం జ‌రిగిన స‌మ‌యంలో దేశాన్ని న‌డిపించాడు.

ఆయ‌న ఇచ్చిన నినాదం జై జ‌వాన్ జై కిసాన్. దేశ ప్ర‌జ‌ల‌ను ఏకం అయ్యేలా చేసింది.

నిరాండ‌ర‌త ఆయ‌న జీవితం. చ‌దువు కోసం న‌ది దాటాడు. స‌ర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్స్ సొసైటీలో శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌లిగి ఉన్నాడు.

1930లో ఉప్పు స‌త్యాగ్ర‌హంలో పాల్గొన్నాడు. రెండున్న‌ర ఏళ్లు జైలులో ఉన్నాడు.

క్విట్ ఇండియా ఉద్య‌మంలో పాల్గొన్నందుకు మ‌రోసారి జైలు పాల‌య్యాడు. అప్పుడే త‌త్వ‌వేత్త‌లు, విప్ల‌వ‌కారులు, సాంఘిక సంస్క‌ర్త‌ల గురించి తెలుసుకున్నాడు.

1947లో వ‌ల్ల‌భ్ పంత్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో మంత్రిగా ఉన్నాడు. ర‌వాణా శాఖా మంత్రిగా మ‌హిళా కండ‌క్ట‌ర్ల‌ను నియ‌మించాడు. లాఠీఛార్జీ ల‌కు బ‌దులు గా వాట‌ర్ జెట్ లు వాడాల‌ని ఆదేశించాడు.

రైల్వే మంత్రిగా ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చాడు. 1964 లో నెహ్రూ మ‌ర‌ణంతో శాస్త్రికి (Lal Bahadur Shastri)చాన్స్ ద‌క్కింది పీఎంగా.

దేశంలో వ్య‌వ‌సాయ విప్ల‌వాన్ని తీసుకు వ‌చ్చాడు. దీర్ఘ కాలిక ఆహార కొర‌త గురించి పిలుపు ఇచ్చాడు శాస్త్రి.

అదేమిటంటే దేశంలోని ప్ర‌జ‌లంతా ఒక భోజ‌నం ఇవ్వాల‌ని కోరాడు.

తాష్కెంట్ ఒప్పందంపై సంత‌కం చేసిన రోజున మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు గుండె పోటుతో మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌క‌టించారు.

కానీ అది మ‌ర‌ణం కాద‌ని కుట్ర అని దేశం న‌మ్మింది. ఆరోపించింది. విజ‌య ఘాట్ లో శాస్త్రి స్మార‌కాన్ని ఏర్పాటు చేశారు.

చివ‌రి దాకా విలువ‌ల‌కు క‌ట్టుబ‌డిన అరుదైన నాయ‌కుడు. మ‌హోన్న‌త మాన‌వుడు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి.

Also Read : సంగీత కెర‌టం దిల్జిత్ దిగ్గ‌జం

Leave A Reply

Your Email Id will not be published!