Kailash Satyarthi : భారత దేశం వీరులను కన్నది. యోధులను తయారు చేసింది. అంతకంటే ఎక్కువగా మానవ హక్కుల కోసం విశ్రమించని ధీరులను తయారు చేసింది. అందులో ఎన్నదగిన హక్కుల కార్యకర్త. నాయకుడు కైలాశ్ సత్యార్థి(Kailash Satyarthi ).
ఇవాళ ఆయన పుట్టిన రోజు. 1954 జనవరి 11న మధ్యప్రదేశ్ లోని విదిశలో పుట్టారు.
ఇంజనీరింగ్ చదివిన ఆయన అంచెలంచెలుగా బాలల కోసం పోరాడే యోధుడిగా నిలిచాడు.
బాలల హక్కుల కోసం కైలాశ్ నిలిచారు. విద్యా హక్కుల కార్యకర్తగా పేరొందారు.
2014లో ఆయన చేసిన సేవలకు ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇటాలియన్ సెనేట్ మోడల్ అవార్డు పొందారు.
ఆల్ఫొన్సో కొమిన్ అంతర్జాతీయ పురస్కారం లభించింది కైలాశ్ కు. జర్మనీ ప్రభుత్వం ఇచ్చే అంతర్జాతీయ శాంతి అవార్డు దక్కింది సత్యార్థ్ కు.
1980లో బచ్ పన్ బచావో ఆందోళన్ ఉద్యమాన్ని నడిపారు. 80 వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు శ్రమించారు.
2014లో పాకిస్తాన్ హక్కుల కోసం పోరాడుతున్న మలాలా యూసఫ్ జాయ్ తో సంయుక్తంగా కైలాశ్(Kailash Satyarthi )తీసుకున్నారు. .
ఇంజనీరింగ్ లో పీజీ చేశారు. భోపాల్ లోని కాలేజీలో అధ్యాపకుడిగా కొంత కాలం పని చేశారు.
1980లో ఉద్యోగాన్ని వీడారు. బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.
ఐసీసీఎల్ఈలో భాగమయ్యాడు. యాక్షన్ ఎయిడ్ , ఆక్స్ ఫెం, ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ సంస్థలకు మద్దతుగా నిలిచాడు కైలాశ్ సత్యార్థి.
రగ్ మార్క్ ను ప్రారంభించారు. ఇది ఇప్పుడు గుడ్ వీవ్ గా పేరు పొందింది. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఇతర సాంఘిక సమస్యలను బాల కార్మిక వ్యవస్థ శాశ్వతంగా కొనసాగేలా చేస్తుందని కైలాశ్ వాదిస్తూ వచ్చారు.
ప్రతి ఒక్కరికీ విద్య అన్నది ఆయన నినాదం. అనేక ఇంటర్నేషనల్ సంస్థలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. రుగ్మక్ అనే సంస్థను స్థాపించి పని చేస్తున్నారు.
బాల్యం అన్నది వరం. దానిని హరించే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని ఆయన నినదించారు. కైలాశ్ సత్యార్థి బాల బాలికలకు చదువు కోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెపుతున్నారు. ఆ దిశగా తాను పోరాడుతున్నారు.
Also Read : సునామీ లాంటోడు సుకుమార్