Lata Mangeshkar : ఐసీయూలో గాన కోకిల ల‌తా

క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ

Lata Mangeshkar : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన గాన కోకిల ల‌తా మంగేశ్వ‌ర్ ఇవాళ ఐసీయూలో చేరారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. దీంతో హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ముంబై లోని బ్రీచ్ కాండీ ఆస్ప‌త్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. భార‌త ర‌త్న గ్ర‌హీత అయిన ల‌తా మంగేష్క‌ర్(Lata Mangeshkar) కు తేలిక పాటి ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని ఆమె మేన కోడ‌లు ర‌చ‌న వెల్ల‌డించారు.

వృద్దాప్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ల‌తాజీని ఐసీయూకు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం ల‌తా మంగేష్క‌ర్ బాగానే ఉన్నార‌ని, వ‌య‌సు రీత్యా ముందు జాగ్ర‌త్త కార‌ణాల వ‌ల్ల‌నే ఐసీయూలో ఉంచిన‌ట్లు పేర్కొన్నారు.

ద‌య‌చేసి ప్ర‌తి ఒక్క‌రు ఆ అద్భుత మ‌హా గాయ‌కురాలు బాగుండాల‌ని అంతా కోరుకోవాల‌ని ఆమె కోరారు. 1929 సెప్టెంబ‌ర్ 28న పుట్టారు ల‌తా మంగేష్క‌ర్.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఫ్రాన్స్ అత్యున్న‌త పౌర పుర‌స్కారం, ఆఫీస‌ర్ ఆఫ్ ది లెజియ‌న్ ఆఫ్ హాన‌ర్ తో పాటు అనేక జాతీయ , అంత‌ర్జాతీయ అవార్డులు పొందారు.

1974లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమెను చేర్చారు. అత్య‌ధికంగా పాట‌లు పాడిన గాయ‌నిగా పేరు సంపాదించారు ల‌తా మంగేష్క‌ర్(Lata Mangeshkar). 1948 నుంచి 1974 మ‌ధ్య 25 వేల పాట‌లు పాడిన‌ట్లు గుర్తించారు.

హిందీ, మ‌రాఠీ, తెలుగు, త‌మిళం ఇలా ప్ర‌తి భాష‌లోనూ ల‌తా జీ పాట‌లు పాడారు. సంగీత ప‌రంగా భార‌తీయ సినిమాకు ల‌తా మంగేష్క‌ర్ చేసిన సేవ‌ల‌ను గుర్తించి భార‌త ప్ర‌భుత్వం 2001లో అత్యున్న‌త పౌర పుర‌స్కారం భార‌త‌ర‌త్న‌ను ప్ర‌క‌టించింది.

Also Read : స‌ముద్ర‌ఖ‌ని ప‌బ్లిక్ లుక్ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!