Gavaskar : భారత, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు కేప్ టౌన్ లో ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఊహించని రీతిలో భారత జట్టు ఇప్పటికే రెండు వికెట్లను కోల్పోయింది.
ఇద్దరు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు. దీనిపై సీరియస్ అయ్యారు భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్(Gavaskar). మయాంక్ ఆట తీరుపై మండిపడ్డాడు.
బ్యాట్ ఎక్కడికి పోయిందో చూడు అని పేర్కొన్నాడు. బంతిని ఎదుర్కోవడంలో ఫోకస్ పెట్టడం లేదన్నాడు. అందుకే త్వరగా పెవిలియన్ చేరాడని తెలిపాడు. ఇలాగేనా ఆడేది అంటూ ఫైర్ అయ్యాడు సన్నీ .
కగిసో రబాడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. బంతి వేసిన ప్రతిసారి బీట్ అవుతుండడం ఇబ్బంది పెడుతోంది. ఈ సమయంలో మయాంక్ అగర్వాల్ డిఫెన్స్ ఆడడంలో కూడా ఫోకస్ పెట్టక పోవడం దారుణమన్నాడు.
కదులుతున్న బంతికి భారత్ ఓపెనర్ చాలా బలహీనంగా కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు సునీల్ మనోహర్ గవాస్కర్(Gavaskar). టెస్టు మ్యాచ్ లో బంతులు పక్కకు వెళితే పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నాడు.
దాని గురించి ఆలోచించకుండా ఉంటేనే బెటర్. ఏ మాత్రం బంతులు నేరుగా వచ్చిన వాటినే ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుందన్నాడు.
ఇదిలా ఉండగా భారత జట్టు బ్యాటర్లు పూర్తిగా అదర్ సైడ్ బాల్స్ ను ఆడుతూ తమ వికెట్లను త్వరగా పారేసుకుంటున్నారు. దీని పైనే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Also Read : రషీద్ ఖాన్ పై ఆ రెండూ ఫోకస్