Washington Sundar : కరోనా మరోసారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే ఊహించని రీతిలో దేశ వ్యాప్తంగా లక్షా 70 వేలకు దగ్గరగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కొత్త వేరియంట్ ఓమిక్రాన్ సైతం నానా ఇబ్బందులు పెడుతోంది.
తాజాగా భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆటగాళ్లు పూర్తిగా క్వారంటైన్ లో ఉన్నప్పటికీ కరోనా వీడడం లేదు. సౌతాఫ్రికా టూర్ లో ఉన్న భారత జట్టు ప్రస్తుతం మూడు టెస్టుల్లో భాగంగా కేప్ టౌన్ లో మూడో టెస్టు ఆడుతోంది.
కాగా మూడు మ్యాచ్ ల వన్డే సీరీస్ ఆడాల్సి ఉంది. ఇప్పటికే వన్డే టీంను ఎంపిక చేసింది భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ. ఆ జట్టులో ఎంపిక చేసిన వాషింగ్టన్ సుందర్(Washington Sundar) కు కరోనా సోకినట్లు సమాచారం.
దీంతో అతను వన్డే మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం కష్టమేనని అనిపిస్తోంది. ఇదిలా ఉండగా టీ20, వన్డే, టెస్టు మ్యాచ్ లకు పూర్తిగా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్నారు.
ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది వన్డే సీరీస్. మరో వైపు గాయం కారణంగా కొంత కాలం పాటు టీమిండియా కు దూరంగా ఉన్నాడు వాషింగ్టన్ సుందర్. దేశీవాళి క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ము రేపాడు మనోడు.
దీంతో సెలెక్షన్ కమిటీ సుందర్ (Washington Sundar)ను వన్డే టీమ్ కు ఎంపిక చేసింది. రెగ్యులర్ స్కిప్పర్ రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పు కోవడంతో కేఎల్ రాహుల్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ.
Also Read : ఆటకు గుడ్ బై కోచ్ కు సై